For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC Playing XI: పృథ్వీ షా ఇన్.. ఇషాంత్ ఔట్! రాజస్థాన్‌తో ఆడే ఢిల్లీ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2024 సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గురువారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్‌తో ఓటమిపాలైన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆ తప్పిదాలను సరిదిద్దుకొని బరిలోకి దిగుతోంది.

ఏడాదిన్నర సుదీర్ఘ విరామం తర్వాత ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ .. రీఎంట్రీ ఇవ్వడం ఆ జట్టుకు కొండంత బలాన్ని ఇచ్చింది. అయితే రీఎంట్రీలో పంత్ ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. వికెట్ కీపింగ్‌లో సత్తా చాటినా... బ్యాటింగ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. రాజస్థాన్ రాయల్స్‌తోనైనా అతను చెలరేగుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

DC Playing XI vs RR IPL 2024 Prithvi Shaw and Anrich Nortje In Shai Hope Out

స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్‌తో పాటు ముకేష్ కుమార్ కూడా టీమ్ సెలెక్షన్‌కు అందుబాటులోకి వచ్చారు. తొలి మ్యాచ్‌లో చీలమండ గాయానికి గురై మధ్యలోనే మైదానం వీడిన ఇషాంత్ శర్మ జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో ముకేష్ కుమార్ ఆడనుండగా.. ప్రధాన పేసర్‌గా అన్రిచ్ నోర్జ్ జట్టులోకి రానున్నాడు.

అన్రిచ్ నోర్జ్ కోసం షైహోప్‌పై వేటు వేసే అవకాశం ఉంది. తొలి మ్యాచ్ ఆడని పృథ్వీ షా కూడా ఈ మ్యాచ్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ అతను ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడితే మాత్రం రికీ భూయ్ తుది జట్టులో కొనసాగుతాడు. పృథ్వీ షా అందుబాటులోకి వస్తే డేవిడ్ వార్నర్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తాడు. లేదంటే మిచెల్ మార్ష్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు.

మిడిలార్డర్‌లో రిషభ్ పంత్‌తో పాటు ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్ బ్యాటింగ్ చేయనున్నారు. తొలి మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అభిషేక్ పోరెల్ సంచలన బ్యాటింగ్‌తో ఢిల్లీకి పోరాడే లక్ష్యాన్ని అందించాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ ఆడనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు అవకాశం దక్కనుంది.

ముఖేష్ కుమార్, అన్రిచ్ నోర్జ్, ఖలీల్ అహ్మద్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ పర్వాలేదనిపించాడు. ఆల్‌రౌండర్ మిచెల్ కూడా చెలరేగితే ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరుగుండదు. అన్రిచ్ నోర్జ్‌, షైహోప్‌లను ఇంపాక్ట్ ప్లేయర్లుగా వాడుకునే అవకాశం ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు(అంచనా)

డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్ , అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అన్రిచ్ నోర్జ్, ఖలీల్ అహ్మద్

ఇంపాక్ట్ ప్లేయర్స్: షై హోప్, యశ్ ధుల్, రికీ భూయ్, లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే

Story first published: Wednesday, March 27, 2024, 18:30 [IST]
Other articles published on Mar 27, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+