Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC Playing XI: రిషభ్ పంత్ రీఎంట్రీ.. పంజాబ్ కింగ్స్‌తో ఆడే ఢిల్లీ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2024 సీజన్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. శనివారం పంజాబ్ కింగ్స్‌తో మధ్యాహ్నం 3.30 గంటలకు ములాన్పుర్ క్రికెట్ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌తో ఈ సీజన్ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం అన్ని విధాల సిద్దమైన ఢిల్లీ క్యాపిటల్స్.. విజయంతో ఈ సీజన్‌ను ప్రారంభించాలనే పట్టుదలతో ఉంది.

రోడ్డు ప్రమాదంతో గత ఏడాదిన్నరగా ఆటకు దూరంగా ఉన్న రిషభ్ పంత్‌ ఈ మ్యాచ్‌తో మళ్లీ ప్రొఫెషనల్ క్రికెట్‌ను మొదలు పెట్టనున్నాడు. తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్యాన్ని చేపట్టిన రిషభ్ పంత్.. బ్యాటర్‌గా.. వికెట్ కీపర్‌గా.. సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఐపీఎల్‌లో తన సామర్థ్యాన్ని నిరూపించుకొని టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోవాలని పంత్ భావిస్తున్నాడు.

DC Playing XI vs PBKS for IPL 2024 Rishabh Pant returns to action

ప్రపంచకప్ లక్ష్యంగా..
మరోవైపు పంత్ గైర్హాజరీలో దారుణంగా విఫలమైన ఢిల్లీ క్యాపిటల్స్.. ఈ సీజన్‌లో సత్తా చాటి టైటిల్ సాధించాలనుకుంటోంది. దానికోసం బెస్ట్ ఎలెవన్‌తో బరిలోకి దిగడంపై ఫోకస్ పెట్టింది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్, టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ.. విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ కాంబినేషన్‌లో ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, పృథ్వీ షా బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వన్డేలతో పాటు టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వార్నర్.. కేవలం టీ20ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో సత్తా చాటి టీ20 ప్రపంచకప్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

మిడిలార్డర్‌లో రిషభ్ పంత్..
మరోవైపు పృథ్వీ షా సైతం.. ధనాధన్ బ్యాటింగ్‌తో మళ్లీ టీమిండియాలోకి అడుగుపెట్టాలనే కసితో ఉన్నాడు. మిడిలార్డర్‌లో మిచెల్ మార్ష్, రిషభ్ పంత్, లలిత్ యాదవ్‌తో పాటు ట్రిస్టన్ స్టబ్స్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే ఎక్స్‌ట్రా ఓవర్‌సీస్ పేసర్‌తో బరిలోకి దిగితే ట్రిస్టన్ స్టబ్స్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు.

స్టబ్స్ జట్టులోకి వస్తే జై రిచర్డ్‌సన్‌ బెంచ్‌కు పరిమితమవుతాడు. ఫినిషర్‌గా అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ బరిలోకి దిగనున్నాడు. అభిషేక్ పోరెల్‌కు కుమార్ కుశాగ్ర నుంచి పోటీ ఉండనుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడనుండగా.. పేసర్లుగా అన్రిచ్ నోర్జ్, ముకేష్ కుమార్ బరిలోకి దిగనున్నారు. ట్రిస్టన్ స్టబ్స్, రిలే మెరిడిత్, అభిషేక్ పోరెల్‌ను ఇంపాక్ట్ ప్లేయర్లుగా వాడుకునే అవకాశం ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు(అంచనా):
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్(కెప్టెన్), అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుమార్ కుశాగ్ర/అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, ముకేష్ కుమార్, అన్రిచ్ నోర్జ్, జై రిచర్డ్‌సన్.

Story first published: Friday, March 22, 2024, 15:55 [IST]
Other articles published on Mar 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+