For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సింగ్ కేసులో మరో ట్విస్ట్ ఇచ్చిన మహిందానంద!

Day After Police Drop Probe, Sri Lanka Sports Minister Offers ICC Evidence 2011 World Cup Was Fixed

కొలంబొ: భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫిక్స్‌ అయిందంటూ సంచలన ఆరోపణలు చేసిన లంక మాజీ క్రీడల మంత్రి మహిందానంద అలత్గమగే మరో ట్విస్ట్ ఇచ్చాడు. పోలీస్ విచారణలో తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, కేవలం అనుమానం మాత్రమే అని తెలిపిన మహిందానంద తాజాగా తన దగ్గర ఆధారాలున్నాయంటూ బాంబు పేల్చాడు.

ప్రత్యేక బృందంతో దర్యాప్తు..

ప్రత్యేక బృందంతో దర్యాప్తు..

ఇక ఈ మాజీ క్రీడా మంత్రి చేసిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న శ్రీలంక ప్రభుత్వం.. ఫొన్సెక నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించింది. విచారణలో మహిందానందతో పాటు అప్పటి చీఫ్ సెలెక్టర్ డిసిల్వా, ఓపెనర్ ఉపుల్ తరంగ, కెప్టెన్ కుమార సంగక్కరలను పిలిపించిన ఆ టీమ్.. వారి స్టేట్‌మెంట్‌లను రికార్డు చేసింది. అయితే మ్యాచ్‌ ఫిక్స్‌ అయిందంటూ వచ్చిన ఆరోపణలకు తగిన ఆధారాలు లభించకపోవడం, ఓ రాజకీయనాయకుడి ఆరోపణలతో స్టార్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టడం ఏంటనే విమర్శలు రావడంతో దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు శ్రీలంక క్రీడాశాఖ తెలిపింది.

ఐసీసీకి సమాచారమిచ్చా..

ఐసీసీకి సమాచారమిచ్చా..

విచారణ ముగిసిన నేపథ్యంలో మరోసారి మహిందానంద తన వద్ద ఆధారాలున్నాయని.. కేసుని రీఓపెన్ చేయాలంటూ డిమాండ్ చేశాడు. ఫిక్సింగ్ జరిగినట్లు తన దగ్గర ఉన్న ఆధారాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కి అందజేస్తానని తెలిపాడు. ఇప్పటికే ఐసీసీ యాంటీ కరప్షన్ చీఫ్ అలెక్స్ మార్షల్‌కు ఈ విషయాన్ని తెలియజేశానని, మరిన్ని ఆధారాలు సమర్పించేందుకు తాను సిద్దమన్నాడు.

చేతులు మారిన డబ్బు..

చేతులు మారిన డబ్బు..

ఫిక్సింగ్‌పై విచారణను నిలిపివేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు కూడా మహిందానంద ఆరోపణలు గుప్పించాడు. పవర్ ఫుల్ వ్యక్తులే నిజనిజాలు బయటకు రాకుండా ఇలా చేస్తున్నారని తెలిపాడు. 2011 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫలితంపై తమకు ఎలాంటి సందేహాలు లేవని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) కూడా స్పష్టం చేసింది. మ్యాచ్‌ జరిగిన తీరును అనుమానించాల్సిన అవసరమే లేదని ఐసీసీ ఏసీయూ జనరల్‌ మేనేజర్‌ అలెక్స్‌ మార్షల్‌ చెప్పారు. ‘ఈ మ్యాచ్‌ గురించి ఇటీవల వచ్చిన ఆరోపణలపై మేం కూడా దృష్టి పెట్టాం. కొత్తగా విచారణ జరిపేందుకు కావాల్సిన అంశాలు కూడా ఏమీ లేవు'అని ఆయన పేర్కొన్నారు.

భారత్ సూపర్ విక్టరీ..

భారత్ సూపర్ విక్టరీ..

ఇక నాటి ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 274/6 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌.. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సెహ్వాగ్‌ (0), సచిన్‌ (18)ల వికెట్లను త్వరగా కోల్పోయింది. ఆ క్లిష్ట స్థితిలో గౌతమ్ గంభీర్(97) అద్భుత పోరాటానికి.. ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ తోడవడంతో ఆరు వికెట్లతో టీమిండియా విజయం సాధించి 28 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై రెండో ప్రపంచకప్‌ను సాధించింది.

Story first published: Sunday, July 5, 2020, 12:05 [IST]
Other articles published on Jul 5, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+