బీర్ గ్లాస్‌లో పడిన బంతి
బీబీఎల్ 10లో భాగంగా జనవరి 2న (శనివారం) హోబర్ట్ హరికేన్స్-మెల్‌బోర్న్ స్టార్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ జరిగింది. హోబర్ట్ హరికేన్స్ బ్యాటర్ డేవిడ్ మలాన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75 పరుగులు చేశాడు. కాగా అందులో ఒక సిక్స్ ఫ్యాన్ బీర్ గ్లాస్‌లో పడింది. మెల్‌బోర్న్ స్టార్స్ బౌలర్ లాన్స్ మోరిస్ వేసిన 16వ ఓవర్‌లో ఒక బంతిని మలాన్ భారీ షాట్ ఆడాడు. స్వేర్ లెగ్ మీదుగా లాఫ్టెడ్ స్ట్రోక్ ఆడాడు. గ్యాలరీలోకి దూసుకొచ్చిన ఆ బంతిని పట్టుకోవడానికి ఓ అబిమాని ప్రయత్నించగా.. మిస్ అయింది. బంతి కాస్త వెళ్లి బీరు తాగుతున్న ఓ అబిమాని గ్లాస్‌లో పడింది.

ఒక సిప్ లాగించి
బంతి బీర్ గ్లాస్‌లో పడగానే అక్కడున్న వారందరూ కేరింతలు కొట్టారు. ఇక తన గ్లాస్‌లో పడ్డ ఆ బంతిని ఇవ్వడానికి సదరు అభిమాని తొలుత నిరాకరించాడు. తాను బంతిని ఇవ్వనంటూ ఫీల్డర్‌ను ఆటపట్టించాడు. దీంతో ఫీల్డర్ రైన్ బర్డ్ ఒక్కసారి వెనక్కి వచ్చేశాడు. ఆ బంతి గ్లాస్‌లో ఉండగానే ఒక సిప్ లాగించిన తర్వాత దాన్ని తిరిగి వెనక్కి ఇచ్చాడు. ఈ సరదా ఘటన కామెంటేటర్లతో పాటు మైదానంలో కూర్చొన్న అభిమానుల్ని కూడా అలరించింది. ఇది బీబీఎల్ బెస్ట్ క్యాచ్‌ల్లో స్థానం సంపాదించకపోయినప్పటికీ.. ఆ అభిమానికి మాత్రం అదొక జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

ఆల్ టైం బకెట్ మూమెంట్
అభిమాని చేసిన సరదా పనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 'KFC బిగ్ బాష్ లీగ్' తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. 'ఆల్ టైం బకెట్ మూమెంట్' అని వీడియోకు కాప్షన్ జతచేసింది. ఈ వీడియో చూసిన అందరూ తెగ నవ్వుతుంటున్నారు. అంతేకాదు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'సూపర్ క్యాచ్ విత్ బీర్' అని ఓ ఒకరు ట్వీట్ చేయగా.. 'వావ్.. ఏమా అద్భుత క్యాచ్' అని మరొకరు ట్వీట్ చేశారు. బీబీఎల్ టోర్నమెంట్‌లోనే ఇది అత్యుత్తమ క్యాచ్ అని ఇంకొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మలాన్ హాఫ్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ 21 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ హాఫ్ సెంచరీ చేయగా.. బెన్ మెక్‌డెర్మాట్ (31) రాణించాడు. స్టాన్లేక్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ 143 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. గ్లెన్ మాక్స్వెల్ (70) ఒంటరి పోరాటం చేశాడు. స్కాట్ బోలాండ్ 3 వికెట్లు తీశాడు.
ఓడిపోతామనే భయంతోనే.. టీమిండియా నాలుగో టెస్టు ఆడమంటోంది: బ్రాడ్ హాడిన్ సంచలన వ్యాఖ్యలు


Click it and Unblock the Notifications












