ఓడిపోతామనే భయంతోనే.. టీమిండియా నాలుగో టెస్టు ఆడమంటోంది: బ్రాడ్ హాడిన్ సంచలన వ్యాఖ్యలు

మెల్‌బోర్న్: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఇంకా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాలి. గురువారం (జనవరి 7) సిడ్నీలో మూడో టెస్టు ఆరంభం కానుంది. ఇక జనవరి 15 నుంచి బ్రిస్బేన్ వేదికగా చివరిదైన నాలుగో టెస్టు జరుగనుంది. అయితే బ్రిస్బేన్‌లో జరగాల్సిన చివరి టెస్ట్ సందిగ్ధంలో పడింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విధించే ఆంక్షలతో టీమిండియా.. నాల్గో టెస్టు ఆడలేమని అంటోంది. క్వీన్‌లాండ్స్ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి కేసులు ఎక్కువగా ఉండటంతో.. మ్యాచ్‌ను బ్రిస్బేన్‌లోనే నిర్వహించినా కఠినమైన ఆంక్షలు అమలు చేయాలని సీఏ చూస్తోంది. అయితే దీనికి టీమిండియా ఒప్పుకోవడం లేదు.

హోటల్ రూమ్‌లకే పరిమితం
చివరి టెస్ట్ కోసం ఇండియా, ఆస్ట్రేలియా ప్లేయర్స్ చార్టర్డ్ విమానాల్లో బ్రిస్బేన్‌కు వెళ్లనున్నారు. బ్రిస్బేన్‌కు వెళ్లిన తర్వాత ప్రాక్టీస్, మ్యాచ్‌ల సందర్భంగానే టీమ్స్ బయటకు రావాలని.. మిగతా సమయం మొత్తం హోటల్ రూమ్‌లకే పరిమితం కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే టీమిండియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్వారంటైన్ ఉండలేమని చెప్పేసింది. ఇప్పటికే నెల రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నామని, మళ్లీ ఐసోలేషన్ అంటే మా వాళ్ల కాదని టీమిండియాకు చెందిన ఓ సీనియర్ అధికారి ఆదివారం క్రిక్‌బజ్‌తో అన్నాడు. ఒక్క మ్యాచ్ కోసం కఠినమైన ఆంక్షలు అమలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.

వాకౌట్ చేస్తాం
మూడో టెస్టు జరిగే సిడ్నీలోనే నాల్గో టెస్టు కూడా నిర్వహిస్తే బాగుంటుందని టీమిండియాకు చెందిన ఓ సీనియర్ అధికారి క్రికెట్ ఆస్ట్రేలియాకు సూత్రప్రాయంగా సూచించాడు. అయితే దీనికి ఆసీస్ ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా నాల్గో టెస్టును వాకౌట్ చేస్తామని హెచ్చరించింది. కఠినమైన ఆంక్షలు విధిస్తే ఆ టెస్టు ఆడబోమనే సంకేతాలు పంపింది. అయితే దీనిపై పలువురు ఆసీస్ మాజీలు స్పందిస్తున్నారు. తాజాగా ఆసీస్ మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బ్రిస్బేన్‌లో ఇప్పటివరకు ఎవరూ గెలవలేదని, ఎఓడిపోతామనే భయంతోనే టీమిండియా వాకౌట్ చేస్తామంటోంది అని హాడిన్ అన్నాడు.

ఇక్కడ ఆస్ట్రేలియానే ఫేవరెట్
తాజాగా ఫాక్స్ క్రికెట్‌తో బ్రాడ్ హాడిన్ మాట్లాడుతూ... 'ఒక క్రికెట్ కోణం చూస్తే.. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియానికి టీమిండియా ఎందుకు వెళ్లాలనుకుంటుంది. ఇక్కడ ఆస్ట్రేలియానే ఫేవరెట్. ఆ విషయం టీమిండియాకు తెలుసు. ఇక్కడ సుదీర్ఘ కాలంగా ఆసీస్‌దే పైచేయి. వేరే జట్టులు ఇక్కడ గెలిచిన సందర్భాలు చాలా చాలా తక్కువ. అందుకే భారత్ ఆడనంటోంది' అని అన్నాడు. 'అయితే టీమిండియా క్రికెటర్లు ఎప్పట్నుఉంచో బయో బబుల్ నిబంధనల్ని పాటిస్తూ వస్తున్నారు. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. బబుల్ వల్ల వారు చాలా కొంచెం అలసిపోయుంటారు' అని హాడిన్ మళ్లీ తనను తాను సమర్ధించుకున్నాడు.

అలా అయితే రావద్దు
'బ్రిస్బెన్ వెళ్లి అక్కడ మళ్లీ కఠిన బబుల్‌లో ఉండటానికి భారత జట్టు ఏ మాత్రం ఆసక్తిగా లేదు. ఇప్పటికే దుబాయ్‌లో 14 రోజుల క్వారంటైన్ ఉన్నాం. ఆ తర్వాత సిడ్నీలో మరో 14 రోజులు స్వీయ నిర్భంధంలోనే ఉన్నాం. దాదాపు నెలరోజుల పాటు కఠిన క్వారంటైన్‌ను పాటించాం. కాబట్టి తమను మాములు ఆస్ట్రేలియా ప్రజల్లానే పరిగణించాలి. అలా కాకుండా క్వారంటైన్‌లో ఉండాలంటే మాత్రం మా వల్ల కాదు. అది టూర్ ముగిసే సమయంలో ఏమాత్రం భావ్యం కాదు' అని బీసీసీఐ అధికారి తెలిపాడు. భారత జట్టు విన్నపంపై క్విన్స్‌లాండ్ ఆరోగ్యశాఖ మంత్రి రోస్ బేట్స్ ఘాటుగా స్పందించింది. 'భారత ఆటగాళ్లకు నిబంధనలకు అనుగుణంగా ఆడాలని లేకుంటే.. ఇక్కడికి రావద్దు' అని స్పష్టం చేసింది.
గంగూలీ హెల్త్ బులెటిన్.. తదుపరి చికిత్సపై కుటుంబ సభ్యులతో చర్చ!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications