చెలరేగిన విల్లే.. ఐసీసీ సూపర్‌ లీగ్‌‌లో ఇంగ్లండ్ బోణీ!

David Willey, Sam Billings shine as England cruise to six-wicket win over Ireland

సౌతాంప్టన్‌: కరోనా కారణంగా కొన్ని నెలల విరామం తర్వాత జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. ఫలితంగా వన్డే ప్రపంచ చాంపియన్‌ ఇంగ్లండ్‌ కొత్తగా మొదలైన ఐసీసీ 'క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌'లో బోణీ చేసింది. ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' డేవిడ్‌ విల్లీ (5/30) పేస్‌ ధాటికి ఐర్లాండ్‌ 44.4 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. కెరీర్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న కర్టిస్‌ క్యాంఫర్‌ (118 బంతుల్లో 4 ఫోర్లతో 59 నాటౌట్‌) అర్ధ సెంచరీ సాధించగా, ఆండీ మెక్‌బ్రైన్‌ (48 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 40) రాణించాడు. అనంతరం ఇంగ్లండ్‌ 27.5 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది.

స్యామ్‌ బిల్లింగ్స్‌ (54 బంతుల్లో 67 నాటౌట్‌; 11 ఫోర్లు), కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (40 బంతుల్లో 36 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఐదో వికెట్‌కు 96 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. అంతకు ముందు తొలి ఓవర్లోనే స్టిర్లింగ్‌ (2) వికెట్‌ కోల్పోయిన ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ ఆ తర్వాత కుప్పకూలింది. 7 ఓవర్లలోపే కేవలం 28 పరుగులకు జట్టు 5 వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో క్యాంఫర్‌ జట్టును ఆదుకున్నాడు.

కెవిన్‌ ఓబ్రైన్‌ (22)తో ఆరో వికెట్‌కు 51 పరుగులు జోడించిన అతను మెక్‌బ్రైన్‌తో ఎనిమిదో వికెట్‌కు 66 పరుగులు జత చేశాడు. సాఖిబ్‌ మహమూద్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో ఇంగ్లండ్‌ కూడా తక్కు వ వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయినా... బిల్లింగ్స్, మోర్గాన్‌ భాగస్వామ్యంతో విజయం వైపు మళ్లింది. రెండో వన్డే ఇదే మైదానంలో రేపు జరుగుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, July 31, 2020, 8:49 [IST]
Other articles published on Jul 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more