Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వినాయక చవితి విషెస్‌తో అభిమానుల మనసు దోచేసిన డేవిడ్ వార్నర్.. బొజ్జ గణపయ్య...

David Warner wishes fans on Ganesh Chaturthi goes viral

హైదరాబాద్: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి భారతీయుల మనసులను దోచేశాడు. భారత్‌పై ప్రత్యేక అభిమానం కనబర్చే వార్నర్.. సోషల్ మీడియా వేదికగా ఇక్కడి అభిమానులను అలరిస్తుంటాడు. భారతీయ సినిమాల్లోని పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ, డైలాగ్‌లు చెబుతూ ఆకట్టుకుంటాడు. అంతేకాకుండా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే వార్నర్.. ఇక్కడి పండుగలను కూడా జరుపుకుంటాడు.

ఈ నేపథ్యంలోనే అభిమానులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశాడు. సోషల్ మీడియా వేదికగా బొజ్జ గణపయ్య ఫొటోను షేర్ చేస్తూ విషెస్ చెప్పాడు. ఈ ఫొటోలో వార్నర్ రెండు చేతులు జోడించి గణపయ్యను ప్రార్థిస్తున్నట్లు ఉండగా... 'భారత్‌లో ఉన్న నా స్నేహతులందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. మీకు సుఖ సంతోషాలు లభించాలని కోరుకుంటున్నాను'అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టకముందే ఐపీఎల్‌లోకి వచ్చిన వార్నర్.. అద్భుత ప్రదర్శనతో స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. దాంతో అతను భారత్‌పై ఎనలేని ప్రేమను కనబరుస్తాడు. ఆరంభంలో ఢిల్లీ డేర్‌డేవిల్స్ జట్టుకు ఆడిన వార్నర్.. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మారాడు. సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. టైటిల్ అందించడంతో పాటు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకున్నాడు. ఈ క్రమంలోనే తెలుగు ప్రజలతో ప్రత్యేక బంధాన్ని ఏర్పరచుకున్నాడు. హైదరాబాద్ తనకు రెండో ఇళ్లని ప్రకటించాడు.

క్రికెటే కాకుండా ఇక్కడి సినిమాలు చూస్తూ.. పాటలు, డైలాగ్స్, డ్యాన్స్‌లతో అలరించాడు. అయితే ఈ సీజన్ నుంచి మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న వార్నర్.. తెలుగు ప్రేక్షకులను మాత్రం మరిచిపోలేదు. భారత్‌పై ఉన్న ప్రేమతో తన కూతురుకు ఇండియా పేరు వచ్చేలా పేరు కూడా పెట్టాడు.

Story first published: Wednesday, August 31, 2022, 15:58 [IST]
Other articles published on Aug 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+