IPL 2022: మళ్లీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి డేవిడ్ వార్నర్!

హైదరాబాద్: అప్‌కమింగ్ ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్.. మళ్లీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కే ఆడనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత సీజన్‌లో టీమ్‌మేనేజ్‌మెంట్‌తో వార్నర్‌కు బేధాభిప్రాయాలు తలెత్తగా.. అతని పేలవ ఫామ్ కూడా తోడవడంతో జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ వేటుకు గురైన వార్నర్.. ఆ తర్వాత జట్టులోనే చోటు కోల్పోయాడు. కనీసం టీమ్ డగౌట్‌లోకి కూడా అతన్ని అనుమతించలేదు. ఈ గొడవ నేపథ్యంలోనే అతన్ని రిటైన్ చేసుకోలేదు. జట్టుకు టైటిల్ అందించాడనే కృతజ్ఞత కూడా చాటుకోలేదు.

బేధాభిప్రాయాలతో..
అప్పటి హెడ్ కోచ్ ట్రెవర్ బేలిస్, మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్‌తో టీమ్ సెలెక్షన్ విషయంలో డేవిడ్ వార్నర్‌కు బేధాభిప్రాయాలు వచ్చాయి. మనీశ్ పాండే సెలెక్షన్ గురించి డేవిడ్ వార్నర్ పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్‌లో మాట్లాడటం వారికి నచ్చలేదు. దాంతో అతన్ని పక్కనపట్టేసారు. అయితే వచ్చే సీజన్‌కు సన్‌రైజర్స్ తమ కోచింగ్ స్టాఫ్‌ను మార్చుకుంది. మాజీ కోచ్ టామ్ మూడీ మళ్లీ హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. సౌతాఫ్రికా పేస్ గన్ డేయిల్ స్టెయిన్ బౌలింగ్ కోచ్‌గా, సైమన్ కటీచ్ అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. పాత స్టాఫ్‌లో ముత్తయ్య మురళీధరణ్ మినహా మిగతా అంతా మారారు.

మళ్లీ వార్నర్‌ను తీసుకోవాలని..
ఈ క్రమంలోనే టామ్ మూడీ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ డేవిడ్ వార్నర్‌ను మళ్లీ తీసుకోవాలని భావిస్తోందంట. అయితే కెప్టెన్‌గా కేన్ విలియమ్సనే కొనసాగుతాడని, కేవలం ప్లేయర్‌గా మాత్రమే వార్నర్‌ను తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఓ మోస్తారు ధర వరకు డేవిడ్ వార్నర్ కోసం పోటీ పడే అవకాశం ఉందని టీమ్‌కు చెందిన ఓ అధికారి పేర్కొన్నాడు. టీమ్ అనుకున్న ధరకు అందుబాటులో ఉంటే తీసుకుంటారని లేకుంటే వదిలేస్తారని తెలుస్తోంది.

డేవిడ్ వార్నర్ హాట్ కేక్..
ఇక మెగా వేలంలో డేవిడ్ వార్నర్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి. లీగ్‌లో ఎంతో అనుభవం, విన్నింగ్ కెప్టెన్ కావడంతో అతని కోసం భారీ ధరైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) డేవిడ్ వార్నర్ కోసం తెగ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అతనితో ఒప్పందం కుదుర్చుకుందని, అందుకే వార్నర్ కొత్త ఫ్రాంచైజీలకు చిక్కలేదని తెలుస్తోంది. రూ.2 కోట్ల కనీస ధరకు అందుబాటులో ఉన్న వార్నర్‌కు సుమారు రూ.15 కోట్ల వరకు పలికే అవకాశం ఉందనేది విశ్లేషకుల మాట. రూ.10 కోట్లలోపు చిక్కితే తీసుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తోం

2009 నుంచి..
2009లో ఢిల్లీ డేర్‌డేవిల్స్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన వార్నర్.. సౌతాఫ్రికా వేదికగా జరిగిన ఆ సీజన్‌లో ఏడు మ్యాచ్‌ల్లో 163 పరుగులు చేశాడు. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వచ్చిన వార్నర్.. సీజన్ ముగింపులో కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఆ సీజన్‌లో 528 పరుగులు చేసిన వార్నర్.. 2015లో 562 రన్స్ చేశాడు. ఇక 2016లో 848 రన్స్ చేసి.. టైటిల్ గెలిపించాడు. ఓవరాల్‌గా 150 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. 5449 రన్స్ చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications