ఈ ఓటమికి నాదే బాధ్యత.. నా స్లో బ్యాటింగే కొంప ముంచింది: డేవిడ్ వార్నర్

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. అయితే ఈ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. తన స్లో బ్యాటింగే ఓటమికి కారణమైందన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన వార్నర్.. చాలా బంతులను వృథా చేశానని చెప్పాడు. మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, కేదార్ జాదవ్ అద్భుతంగా ఆడారని కొనియాడాడు. తాను ఆడిన షాట్లన్నీ ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లాయని, దాంతో ఒకింత అసహనానికి గురయ్యానని చెప్పుకొచ్చాడు.

నాదే బాధ్యత..
'ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. నా స్లో బ్యాటింగే జట్టు ఓటమికి కారణమైంది. నేను ఫీల్డర్స్ చేతుల్లోకి షాట్లు ఆడాను. మరోవైపు మనీష్ పాండే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కేన్ విలియమ్సన్, కేదార్ జాదవ్ ధాటైన ఇన్నింగ్స్‌లతో మాకు గౌరవప్రదమైన స్కోర్ దక్కింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే మాకు ఓటమి తప్పలేదు. దీనికి పూర్తి బాధ్యత నాదే. వాస్తవానికి నేను ఆడిన ఓ 15 సూపర్ షాట్స్‌ను ఫీల్డర్లు అద్భుతంగా అడ్డుకున్నారు. దాంతో నేను అసహనానికి గురయ్యాను. ఎక్కువ బాల్స్ ఆడాల్సి వచ్చింది. 170 పరుగులు మంచి స్కోరే. కానీ పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోయాం. దాంతో కమ్ బ్యాక్ చేయలేకపోయాం. ఇలాంటి వికెట్స్‌పై పవర్ ప్లే సహకారం లేకుండా గేమ్‌లో నిలవడం చాలా కష్టం.

ఆఖరి వరకు పోరాడాం..
చెన్నై ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఆఖరి వరకు మేం పోరాడాం. ఆరంభంలోనే వికెట్లు తీసుంటే కలిసొచ్చేది. కానీ గేమ్‌లో ఆద్యాంతం వాళ్లు మాపై ఆధిపత్యం చెలాయించారు. కేన్ ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడనేది విషయమే కాదు. అతను ఏ స్థానంలో వచ్చినా సమర్థవంతంగా తన పనిని తాను చేస్తాడు. నైట్ మ్యాచ్‌ల్లో 170 పరుగుల మంచి స్కోరే. అయినప్పటికీ పరిస్థితులు మాకు అనుకూలించలేదు. బ్యాటింగ్‌లో మా లోపాలను సరిచేసుకోవడంతో పాటు సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది. మా జట్టులో చాలా మంది పోరాట యోధులు ఉన్నారు. ఈ ఓటమి మా ఆటగాళ్లను బాధపెట్టవచ్చు. కానీ తిరిగి పోరాడుతారు.'అని వార్నర్ చెప్పుకొచ్చాడు.

55 బంతుల్లో 57..
బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై వార్నర్ 55 బంతుల్లో కేవలం 57 రన్స్ మాత్రమే చేయడంతో హైదరాబాద్ భారీ స్కోర్ చేయలేకపోయింది. వార్నర్ ఆడిన షాట్లన్నీ నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లడంతో సింగిల్సే వచ్చాయి. దాంతో తీవ్ర అసహనానికి గురైన వార్నర్ ధాటిగా ఆడే ప్రయత్నంలో పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్ ధాటిగా ఆడటంతో హైదరాబాద్ ఈ స్కోర్ అయినా చేయగలిగింది. శార్దూల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్‌లో కేన్ వరుసగా 4, 6, 4, 4తో నాలుగు బౌండరీలు బాదడంతో 20 పరుగులొచ్చాయి. అతనికి తోడుగా చివరి ఓవర్‌లో కేదార్ జాదవ్ ఓ సిక్స్, ఫోర్ కొట్టడంతో సన్‌రైజర్స్ 171 పరుగుల భారీ స్కోర్ చేసింది. చివరి రెండు ఓవర్లలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ 33 పరుగులు చేసింది.

చెలరేగిన చెన్నై ఓపెనర్లు..
ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(44 బంతుల్లో 12 ఫోర్లతో 75), ఫాఫ్ డూప్లెసిస్(38 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో చెన్నై 9 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 171 రన్స్ చేసింది. మనీష్ పాండే(46 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 61), డేవిడ్ వార్నర్( 55 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీలతో రాణించగా.. చివర్లో కేన్ విలియమ్సన్(10 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 నాటౌట్) మెరుపులు మెరిపించారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 173 రన్స్ చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒక్కడే మూడు వికెట్లు తీయగా.. మిగతా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. ఈ విజయంతో చెన్నై పాయింట్స్ టేబుల్లో టాప్‌లోకి దూసుకెళ్లగా.. సన్‌రైజర్స్ అట్టడగును కొనసాగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications