Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ ఫేవరేట్ మూమెంట్ షేర్ చేసిన డేవిడ్ వార్నర్

David Warner shares the picture of his favourite IPL moment

సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కారణంగా ఓవర్సీస్ ప్లేయర్లకు భారత అభిమానులతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వారికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వచ్చింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు హైదరాబాద్‌తో విడదీయలేని బంధం ఏర్పడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన ఈ డాషింగ్ ఓపెనర్ అద్భుత బ్యాటింగ్‌తో అభిమానుల హృదయాలను గెలచుకున్నాడు.

2014 నుంచి సన్ రైజర్స్ తరఫున ఆడుతున్న వార్నర్.. 2016లో తన సారథ్యంలోనే టైటిల్ కూడా అందించాడు. ఆ సీజన్ ఆసాంతం ఒంటి చేత్తో బ్యాటింగ్ విభాగాన్ని నడిపించిన ఈ ఆసీస్ డాషింగ్ ఓపెనర్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్లో మైమరిపించే తన ఆటతో ఆకట్టుకున్నాడు.

తాజాగా వార్నర్ ఐపీఎల్ చరిత్రలో తన ఫేవరేట్ మూమేంట్ ఏంటో అభిమానులతో పంచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా.. 2016 సీజన్ ఫైనల్లో విజయానంతరం టైటిల్‌‌తో సహా జట్టుతో ఇచ్చిన ఫోజ్.. తన ఆల్‌టైమ్ ఐపీఎల్ ఫేవరెట్ మూమెంట్ అని తెలిపాడు. ఈ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. ఇదే నా ఫేవరేట్ ఐపీఎల్ మూమెంట్. నా భారత కుటుంబం.. సన్ రైజర్స్ హైదరాబాద్'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

బాల్ ట్యాంపరింగ్‌తో ఒక సీజన్‌కు దూరమైన వార్నర్.. గత సీజన్‌లో పాల్గొన్నా ఆటగాడిగానే బరిలోకి దిగాడు. ఇక ఈ సీజన్‌కు మందు సన్ రైజర్స్ ఫ్రాంచైజీ మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగించింది. దీంతో గత రెండు సీజన్లలో కెప్టెన్సీ వహించిన కేన్ విలియమ్సన్ స్థానంలో వార్నర్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నాడు. కానీ కరోనా దెబ్బతో మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ ఏప్రిల్ 15కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఈ క్యాష్ రిచ్ లీగ్ నిర్వహణపై సందేహాలు రేకిత్తిస్తున్నాయి.

Story first published: Thursday, April 2, 2020, 20:03 [IST]
Other articles published on Apr 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+