For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రష్మిక మందనాను వదిలిపెట్టలేదు.. డేవిడ్ వార్నర్ ఎకసెక్కాలు మాములుగా లేవ్‌గా..! (వీడియో)

 David Warner shares hilarious spoof video as Rashmika Mandanna in Bheeshma swaps face with actress

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరో స్పూఫ్ వీడియో‌తో అలరించాడు. తెలుగు అభిమానులనే లక్ష్యంగా చేసుకొని ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్‌గా తెలుగు ప్రజలతో వార్నర్‌కు విడదీయరాని బంధం ఉంది. భారత్‌ను తన రెండో ఇళ్లుగా పరిగణించే వార్నర్.. హైదరాబాద్‌ తన సొంతగడ్డగా ఫీలవుతాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన డైలాగ్స్ చెబుతూ.. సాంగ్స్‌కు చిందేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు.

లాక్‌డౌన్‌లో టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరి సినిమాల సాంగ్స్‌కు చిందేసాడు. ఆ వీడియోలను అభిమానులతో పంచుకొని టాలీవుడ్ టాప్ హీరోలు, డైరెక్టర్ల మన్ననలు అందుకున్నాడు. వార్నర్ ఒక్కడే కాకుండా ఫ్యామిలీ మొత్తం కూడా అతనితో కాలు కదపడం మరో విశేషం. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ డేవిడ్ వార్నర్‌ను వదిలేసినప్పుడు తెలుగు అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. సన్‌రైజర్స్‌ను వదిలి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారినా వార్నర్ మాత్రం తెలుగు ప్రజలతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోలేదు.

తెలుగు సినిమాలను ఫాలో అవుతూ.. స్పూఫ్ వీడియోలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. తాజాగా భీష్మ సినిమాలో ఓ సాంగ్‌ను స్పూఫ్ చేశాడు. విచిత్రం ఏంటంటే ఎప్పుడూ హీరోల ముఖాలకు తన ఫేస్ పెట్టి స్పూఫ్ చేసే వార్నర్.. ఈ సారి రష్మిక మందనా ఫేస్‌ను తన ముఖంగా మార్చాడు. దాంతో నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ సినిమాలో 'వాటే బ్యూటీ'పాటలోని.. 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు' అనే లిరిక్స్‌ను ఎడిట్ చేశాడు. రష్మిక ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇమిటేట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కగా.. డేవిడ్ వార్నర్ ఎకసెక్కాలు మాములుగా లేవు కదా? అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక అంతకుముందు డీజే టీల్లు సినిమాకు సంబంధించిన వీడియో స్పూఫ్‌ను షేర్ చేశాడు.

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో డేవిడ్ వార్నర్ చాలా దారుణంగా విఫలమయ్యాడు. మొత్తం నాలుగు మ్యాచులు ఆడిన అతను కేవలం 44 పరుగులు మాత్రమే చేశాడు. వార్నర్ వైఫల్యంతో ఆస్ట్రేలియా సెమీఫైనల్ చేరకుండానే ఇంటిదారిపట్టింది. ఇక టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పడంపై వార్నర్ హింట్ ఇచ్చాడు.

Story first published: Monday, November 14, 2022, 20:29 [IST]
Other articles published on Nov 14, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+