Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sunrisers Hyderabad వదిలేయడంపై డేవిడ్ వార్నర్ భావోద్వేగం! కథ ముగిసిందంటూ..

David Warner Shares Heartfelt Message After Getting Released by SRH

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు కీలక ఘట్టమైన రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. 8 పాత ఫ్రాంచైజీలు సుదీర్ఘ కాలంగా తమ విజయాల్లో భాగంగా ఉన్న కొందరు ఆటగాళ్లపై నమ్మకం పెట్టుకోగా, మరికొందరిని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొనసాగించేందుకు సిద్ధపడ్డాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఊహిచినట్లుగానే తమ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను వేలంలోకి వదిలేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (రూ.14 కోట్లు), యువ హిట్టర్ అబ్దుల్ సమద్ (రూ.4 కోట్లు), కశ్మీర్ పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్ (రూ.4 కోట్లు)ను మాత్రమే రిటైన్ చేసుకుంది. టాప్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను కూడా సన్‌రైజర్స్ రిటైన్ చేసుకోలేకపోయింది.

కథ ముగిసింది..

కథ ముగిసింది..

అయితే తనను వేలంలోకి వదిలేయడంపై డేవిడ్ వార్నర్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా కథ ముగిసిందంటూ.. ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ భావోద్వేగానికి గురయ్యాడు. 'అధ్యాయం ముగిసింది. గత కొన్నేళ్లుగా సపోర్ట్ చేసిన అభిమానులకు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ధన్యవాదాలు'అని వార్నర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశాడు. జానీ బెయిర్ స్టో సైతం.. సన్‌రైజర్స్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. సన్‌రైజర్స్ ముగ్గురి ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవడంతో.. ఆ జట్టు దగ్గర ఇంకా రూ.68 కోట్లు ఉన్నాయి.

2014 సీజన్ నుంచి..

ఐపీఎల్ 2014 సీజన్‌ వేలంలో రూ. 5.5 కోట్లకి డేవిడ్ వార్నర్‌ని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత ఏడాదే కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది. కెప్టెన్‌గా టీమ్‌ని ముందుండి నడిపించిన వార్నర్ ఐపీఎల్ 2016 సీజన్‌లో హైదరాబాద్‌ను విజేతగా నిలిపాడు. కానీ.. ఐపీఎల్ 2021 సీజన్‌లో డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ భారంగా భావించింది. సీజన్ మధ్యలో అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా.. కనీసం తుది జట్టులో కూడా చోటివ్వలేదు. దాంతో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ని వార్నర్ వీడటం లాంఛనంగా మారిపోయింది.

కొత్త జట్లకే వార్నర్..

కొత్త జట్లకే వార్నర్..

2014 నుంచి హైదరాబాద్ టీమ్‌కి ఆడిన వార్నర్.. 95 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 142.59 స్ట్రైక్‌రేట్‌తో 4014 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను మూడు సార్లు ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ.. ఐపీఎల్ 2021 సీజన్‌లో అతను అంచనాల్ని అందుకోలేకపోయాడు. బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా.. కెప్టెన్‌గానూ డేవిడ్ వార్నర్‌ ఫెయిలయ్యాడు. దాంతో.. సీజన్ మధ్యలోనే అతడ్ని అవమానకరరీతిలో కెప్టెన్సీ నుంచి తప్పించి.. ఆ తర్వాత జట్టు నుంచి కూడా వేటు వేశారు.

అయినప్పటికీ.. స్టాండ్స్‌లో కూర్చుని హైదరాబాద్ టీమ్‌ని వార్నర్ ప్రోత్సహించాడు. ఇప్పటికీ తనని కెప్టెన్సీ నుంచి తప్పించడానికి గల కారణం తెలియదని వార్నర్ చెప్తున్నాడు. తనకు సన్‌రైజర్స్‌‌తోనే ఉండాలనుందని కూడా చెప్పుకొచ్చాడు. అయితే కొత్త జట్లలోని అహ్మదాబాద్, లక్నో టీమ్స్ పికప్ ఆప్షన్ కింద వార్నర్‌ను తీసుకునే అవకాశం ఉంది.

Story first published: Wednesday, December 1, 2021, 17:36 [IST]
Other articles published on Dec 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+