
హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు దూరమైన ఆ జట్టు మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో పేలవ ప్రదర్శనకు తోడు టీమ్‌మేనేజ్‌మెంట్‌తో వచ్చిన బేధాభిప్రాయాల నేపథ్యంలో ఈ ఆసీస్ స్టార్ జట్టును వీడక తప్పలేదు. బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలంలో డేవిడ్ వార్నర్ తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఇగోకు వెళ్లిన సన్‌రైజర్స్ అతనిపై కన్నెత్తి కూడా చూడలేదు.
అభిషేక్ శర్మ వంటి అనామక ఆటగాళ్లకు కోట్లు తగలేసిన ఆరెంజ్ ఆర్మీ.. వార్నర్‌ను తీసుకోవడానికి మాత్రం ఆసక్తి చూపలేదు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.25 కోట్ల అగ్గువ ధరకే వార్నర్‌ను సొంతం చేసుకుంది. ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడికే వార్నర్ చేరుకున్నాడు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో డేవిడ్ వార్నర్‌కు ఉన్న సుదీర్ఘ ప్రయాణానికి తెరపడింది. అయితే తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లోని తన సహచర ఆటగాడు, కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో దిగిన ఓ పాత ఫొటోను డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇక నుంచి తనతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయలేనని, క్రికెట్ ఆడలేనని క్యాప్షన్‌గా పేర్కొంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
ఇక వార్నర్ పోస్ట్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మొత్తం వార్నర్‌ను మిస్సవుతుందని కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఏడుస్తున్నామని, ఇలాంటి పోస్ట్‌లో మరింత బాధపెట్టవద్దని కోరుతున్నారు. 2009లో ఢిల్లీ డేర్‌డేవిల్స్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన వార్నర్.. సౌతాఫ్రికా వేదికగా జరిగిన ఆ సీజన్‌లో ఏడు మ్యాచ్‌ల్లో 163 పరుగులు చేశాడు. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వచ్చిన వార్నర్.. సీజన్ ముగింపులో కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఆ సీజన్‌లో 528 పరుగులు చేసిన వార్నర్.. 2015లో 562 రన్స్ చేశాడు. ఇక 2016లో 848 రన్స్ చేసి.. టైటిల్ గెలిపించాడు. ఓవరాల్‌గా 150 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. 5449 రన్స్ చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలున్నాయి.