Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్క విజయం దక్కని అందరి సరదా తీరుస్తాం: డేవిడ్ వార్నర్

బెంగళూరు: పేలవ బ్యాటింగ్‌తోనే సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన వార్నర్.. బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చినా.. బ్యాటింగ్‌లో విఫలమయ్యామని తెలిపాడు. బౌలింగ్, ఫీల్డింగ్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన తాము బ్యాటింగ్‌లో మెరుగైతే సరిపోతుందన్నాడు. అది కూడా సరైన ఆరంభం దక్కితే తమ జట్టుకు తిరుగుండదని చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్టింగ్ ప్రాబ్లమ్‌తో బాధపడుతుందని, ఒక్క విజయం దక్కితే తమ సత్తా ఏంటో చూపిస్తామన్నాడు.

 David Warner

'టాస్ సందర్భంగానే మూడు విభాగాల్లో క్రమశిక్షణగా రాణిస్తేనే విజయం దక్కుతుందని చెప్పాను. కానీ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో సునాయసంగా చేధించాల్సిన లక్ష్యాన్ని అందుకోలేకపోయాం. ఆర్‌సీబీ బౌలర్లు బంతితో దుమ్మురేపారు. ఆరంభంలోనే వికెట్లు తీసి మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. ముఖ్యంగా సిరాజ్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.

ఈ మ్యాచ్‌లో ఓడినా.. మా బౌలింగ్, ఫీల్డింగ్ ప్రదర్శన అసాధారణంగా ఉంది. మా బౌలర్లు, ఫీల్డర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఈ మ్యాచ్‌లు మా సానుకూలంశాలు ఇవే. మా తదుపరి మ్యాచ్‌కు ఐదు రోజుల సమయం ఉంది. జట్టుగా మెరుగైన ప్రదర్శన చేసేందుకు మరింత కష్టపడుతాం. బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించడంతో పాటు టాపార్డర్‌లో భాగస్వామ్యాలు నెలకొల్పడంపై మేం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.

ఒక్క శుభారంభం దొరికితే చాలు. మా జట్టు సత్తా ఏంటో చూపిస్తాం. గతంలో ఇలాంటి పరిస్థితుల(వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిన తర్వాత)నుంచి పుంజుకొని కొన్ని జట్లు సత్తా చాటాయి. మేం కూడా పుంజుకొని మెరుగైన ప్రదర్శన చేస్తాం.'అని డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50) మినహా అంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. మనీశ్ పాండే(38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో విజయ్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. వ్యాన్ పార్నెల్, హసరంగా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు.

Story first published: Saturday, April 15, 2023, 22:41 [IST]
Other articles published on Apr 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+