For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ.. నువ్వో దొంగ! నా డ్యాన్స్ మూవ్స్ కాపీ కొట్టావ్! డేవిడ్ వార్నర్ సెటైర్స్!

David Warner says Virat Kohli is Copying my dance moves

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ సెటైర్లు పేల్చాడు. కోహ్లీ.. ఓ కాపీ క్యాట్ అంటూ ఆరోపించాడు. తన డ్యాన్స్ మూవ్స్‌ను విరాట్ కాపీ కొట్టాడని కామెంట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కోహ్లీ షేర్ చేసిన ఓ వీడియోకు వార్నర్ సరదాగా చేసిన ఈ కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. విరాట్ కోహ్లీ ఓ ప్రమోషనల్ వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు.

డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన ఈ ప్రకటనలో విరాట్ చిందేసాడు. తలను అటూ ఇటు తిప్పుతూ డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోకు 'మళ్లీ డిజిట్ కోసం చిందేసా'అని విరాట్ క్యాప్షన్‌ ఇచ్చాడు. అయితే విరాట్ చేసిన ఈ డ్యాన్స్ మూవ్స్ తనవేనని వార్నర్ ఆరోపించాడు. ఈ వీడియో చూసిన వెంటే.. 'నా డ్యాన్స్ మూవ్స్ కాపీ కొట్టావ్'అని కామెంట్ చేశాడు. వార్నర్ సెటైర్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక ఈ వీడియో ఇప్పటికే 4 మిలియన్ల వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

ఇక డేవిడ్ వార్నర్.. బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు చిందేస్తూ అభిమానులను అలరిస్తుంటాడనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో పాటలకు చిందేసిన వార్నర్ భాయ్.. మరెన్నో డైలాగ్స్‌కు లిపి సింక్ ఇచ్చాడు. ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అప్‌కమింగ్ మూవీ 'పుష్పా'లోని 'యే బిడ్డా.. ఇది నా అడ్డా'అనే పాటను ఇమిటేట్ చేశాడు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకొని క్యాప్షన్ ఇవ్వాలని అభిమానులను కోరాడు. ఇక ఈ వీడియోను చూసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వార్నర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. బ్రో.. నీవు బాగానే ఉన్నావ్! కదా అని ఫన్నీగా కామెంట్ చేశాడు. దీనికి వార్నర్ సైతం తనదైన శైలిలో బదులిచ్చాడు. 'నువ్వు నా తల గురించే అడుగుతున్నావని తెలుసు.. కొంచెం గొంతు పట్టేసిందంతే' అని రిప్లే ఇచ్చాడు.

David Warner says Virat Kohli is Copying my dance moves

ఐపీఎల్ 2022 సీజన్‌లో డేవిడ్ వార్నర్.. ఆర్‌సీబీకి ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వార్నర్‌తో ఆర్‌సీబీ ఒప్పందం చేసుకుందని, గ్లేన్ మ్యాక్స్‌వెల్ సాయంతో అతన్ని బుట్టలో వేసుకుందనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియా వేదికగా సన్నిహితంగా ఉన్నారని, ఒకరి పోస్ట్‌లకు మరొకరు స్పందిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. డేవిడ్ వార్నర్‌ను జట్టులోకి తీసుకుంటే టాపార్డర్ బలమవడంతో పాటు కెప్టెన్సీ ఆప్షన్ కూడా లభిస్తుందని మైక్ హెస్సెన్ నేతృత్వంలోని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తుందంట.

Story first published: Thursday, December 16, 2021, 13:13 [IST]
Other articles published on Dec 16, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+