For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే మిచెల్ మార్ష్‌ను పక్కనపెట్టాం: డేవిడ్ వార్నర్

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు కాస్త డ్రైగా ఉందని ఢిల్లీ క్యాపిటల్స్ సారథి డేవిడ్ వార్నర్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో తాము సానుకూలంగా బరిలోకి దిగుతున్నామని చెప్పిన వార్నర్.. జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చామని, వారు రాణిస్తారనే నమ్మకం ఉందన్నాడు.

దురదృష్టవశాత్తు మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని, అతను కాస్త అస్వస్థతకు లోనవ్వడంతో పక్కకు పెట్టాల్సి వచ్చిందన్నాడు. అతని స్థానంలో రిలీ రోసౌ జట్టులోకి వచ్చాడని, గాయం నుంచి కోలుకున్న ఖలీల్ అహ్మద్ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడని తెలిపాడు.

David Warner

మరోవైపు టాస్ గెలిచినా తాము బౌలింగే ఎంచుకునేవాళ్లమని, ఈ మైదానంలో చేజింగ్‌ చాలా సులువని తెలిపాడు. గతంలో చెప్పినట్లుగానే ప్రశాంతంగా ఉంటూ.. సమష్టి ప్రదర్శనలతో విజయాలు అందుకోవడంపై ఫోకస్ పెట్టామని స్పష్టం చేశాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని తెలిపాడు.

8 మ్యాచ్‌‌ల్లో 6 విజయాలు అందుకున్న గుజరాత్ టైటాన్స్.. టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. మరో విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలనుకుంటోంది. మరోవైపు 8 మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచిన ఢిల్లీ.. పరువు కోసం పాకులాడుతోంది. సంచలన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనుకుంటోంది.

తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఫిలిప్ సాల్ట్(కీపర్), మనీశ్ పాండే, రిలీ రోసౌ, ప్రియామ్ గార్గ్, అక్షర్ పటేల్, రిపల్ పటేల్, ఆమన్ హకీమ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జ్, ఇషాంత్ శర్మ.

గుజరాత్ టైటాన్స్: వృద్దిమాన్ సాహా(కీపర్), అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తేవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జోషువా లిటిల్.

Story first published: Tuesday, May 2, 2023, 19:28 [IST]
Other articles published on May 2, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+