Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెంచరీ జోస్ బట్లర్‌కు వదిలేసా.. నా పిల్లలు ఇప్పుడైన సంతోష పడ్డారో? లేదో?: డేవిడ్ వార్నర్

 David Warner says leave to Jos Buttler after missing out on a hundred against SRH

ముంబై: జట్టు నుంచి తప్పించి ఘోరంగా అవమానించిన తన పాత ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కసితీరా పగతీర్చుకున్నాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 92 పరుగులతో ఈ ఢిల్లీ బ్యాటర్ అజేయంగా నిలిచాడు. సెంచరీ చేసుకునే అవకాశం ఉన్నా.. అతను చివరి రెండు ఓవర్లలో స్ట్రైకింగ్ తీసుకోలేదు. వ్యక్తిగత ప్రదర్శన కన్నా జట్టు విజయమే ముఖ్యమని భావించిన వార్నర్.. రోవ్‌మన్ పొవెల్‌ను ధాటిగా ఆడేలా ప్రోత్సహించాడు. సెంచరీ చేసుకోమని పోవెల్ కోరినా అతను నిరాకరించాడు. అయితే మ్యాచ్‌ అనంతరం సెంచరీ చేజార్చుకోవడంపై ప్రశ్నించగా.. వార్నర్ తనదైన శైలిలో బదులిచ్చాడు.

జోస్‌కు వదిలేసా..

జోస్‌కు వదిలేసా..

సెంచరీని జోస్ బట్లర్‌కు వదిలేసానని చమత్కరించాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బట్లర్ రెండు సెంచరీలు బాదిన విషయం తెలిసిందే.

ఇక బట్లర్‌ను ఉద్దేశించి తన కూతుళ్లు అడిగిన ప్రశ్నను గుర్తు చేసుకున్న వార్నర్ ప్రస్తుతం వారు సంతోషంగా ఉంటారని భావిస్తున్నానని తెలిపాడు. లీగ్ ఆరంభంలో జోస్ బట్లర్‌లా సెంచరీలు ఎందుకు చేయలేకపోతున్నావని తన కూతుళ్లు ప్రశ్నించారని వార్నర్ అప్పట్లో చెప్పాడు. ఈ క్రమంలోనే తన ఇన్నింగ్స్‌ను చూసి వారు ఆనందించి ఉంటారని ఆశిస్తున్నానని తెలిపాడు.

 నా పిల్లలు సంతోషంగా..

నా పిల్లలు సంతోషంగా..

'నా పిల్లలు ఇంకా పడుకోలేదనే అనుకుంటున్నా. నా ఇన్నింగ్స్ పట్ల వారు సంతోషంగానే ఉన్నాడని భావిస్తున్నా. కానీ నేను ఇంకా సెంచరీ నమోదు చేయలేదు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసే అవకాశం ఉన్నా జోస్ బట్లర్‌కే వదిలేసా.'అని వార్నర్ చెప్పుకొచ్చాడు. ఇక భువనేశ్వర్ బౌలింగ్‌లో ఆడిన ఇన్నోవేటివ్ షాట్ గురించి మాట్లాడుతూ.. జోస్ బట్లర్‌ను చూసి నేర్చుకున్నానని తెలిపాడు.

జోస్‌ ఆడటం చూసి..

జోస్‌ ఆడటం చూసి..

'భువనేశ్వర్ కుమార్ ఆ బంతిని యార్కర్‌గా వేస్తాడని భావించి. కానీ అతను నా పాదాల కదలికలను గమనించి వైడర్‌గా వేసాడు. దాంతో నేను టర్న్ వెరైటీ షాట్ ఆడాను. అయితే ఈ స్విచ్ హిట్‌ను జోస్ బట్లర్ ఆడటం చూసి నేర్చుకున్నాను. ఆ షాట్ కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాను. స్పిన్నర్లుతో నేను కొన్నిసార్లు నెట్స్‌లో రైట్ హ్యాండ్ బ్యాటర్‌గా ఆడుతాను. అందరూ ఇలాంటి షాట్స్‌ను ప్రయత్నించాలి. నేను దానిని రివర్స్ హిట్ ఆడటానికి ప్రయత్నించాను. కానీ భువీ వైడర్‌గా వేయడంతో అప్పటికప్పుడు ప్లాన్ మార్చి బ్యాక్ కట్ చేసాను.'అని చెప్పుకొచ్చాడు.

అదిరిపోయే రివేంజ్..

అదిరిపోయే రివేంజ్..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌పై చెలరేగడానికి తనకు ప్రత్యేకంగా ఎలాంటి మోటివేషన్ అక్కర్లేదని వార్నర్ తెలిపాడు. 'నాకు వేరే మోటివేషన్‌ ఏమీ అక్కర్లేదు. ఇంతకు ముందు ఏం జరిగిందో మనమంతా చూశాం కదా! నిజంగా ఈ గెలుపు ఎంతో సంతోషాన్నిచ్చింది'అని చెప్పుకొచ్చాడు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. వార్నర్ పట్ల అమానుషంగా ప్రవర్తించింది. తొలుత వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడం, ఆ తర్వాత తుది జట్టు నుంచి తప్పించడం... అనంతరం డ్రింక్స్‌ మోసేలా పరిస్థితులు కల్పించడం, డగౌట్‌కు దూరం చేయడం వంటి పనులుచేసింది. వాటన్నిటికీ డేవిడ్ వార్నర్ అదిరిపోయే రివేంజ్ తీర్చుకున్నాడు.

Story first published: Friday, May 6, 2022, 17:24 [IST]
Other articles published on May 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+