Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH వల్ల చాలా బాధపడ్డాను: డేవిడ్ వార్నర్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తన పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర బాధకు గురిచేసిందని ఆ జట్టు మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఆ జట్టుకు దూరమైన అనంతరం తనను సోషల్ మీడియా వేదికగా బ్లాక్ చేశారని, ఇది తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చెప్పాడు. ఆ జట్టు ప్లేయర్‌గా, కెప్టెన్‌గా సుదీర్ఘ కాలం ఆడానని, ఛాంపియన్‌గా కూడా నిలబెట్టానని, కనీసం ఆ గౌరవం కూడా లేకుండా బ్లాక్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

2023లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలంలో ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కొనుగోలు చేయడంతో వార్నర్.. సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపే ప్రయత్నం చేశాడు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా తన అకౌంట్‌ను బ్లాక్ చేసిందనే విషయం తెలిసి వార్నర్ షాకయ్యాడు.

David Warner says i was hurt over SRH blocking him on social media

అప్పట్లోనే సన్‌రైజర్స్ తనను బ్లాక్ చేసిందనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తాజాగా ఈ విషయం గురించి రవిచంద్రన్ అశ్విన్‌తో జరిగిన చిట్‌చాట్ షోలో మాట్లాడాడు.

'సన్‌రైజర్స్ బ్లాక్ చేయడం చాలా బాధకు గురి చేసింది. ఎందుకంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులే దానికి కారణం. నా అభిప్రాయం ప్రకారం ఆటగాళ్లకు అభిమానులతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. సన్‌రైజర్స్ అభిమానులతో ఉన్న నా బంధం అసాధారణమైనది. వారితో ఇంటరాక్ట్ అవ్వడాన్ని నేను ఓ బాధ్యతగా భావించేవాడిని.

అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ నన్ను ఎందుకు బ్లాక్ చేసిందో నాకు తెలియదు. కానీ ఆ విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నా. ఇది అత్యంత దారుణమైన పని. ఓ కెప్టెన్‌ను సీజన్ మధ్యలోనే తప్పించి తుది జట్టులోకి తీసుకోకపోవడం ఏం పద్దతి? జట్టులోకి కుర్రాళ్లకు ఇచ్చే సందేశం ఏంటి? ఇతర ఆటగాళ్లు ఏం అనుకోవాలి?

మరి ముఖ్యంగా నన్ను బాగా బాధపెట్టిన అంశం ఇతర ఆటగాళ్లు ఏం అనుకుంటున్నారనేదే. ఆటగాడిగా, కెప్టెన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ నన్ను ఎంతో అవమానించింది.'అని డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు డేవిడ్ వార్నర్‌ను జట్టు నుంచి తప్పించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అతని కోసం కనీసం బిడ్ కూడా వేయలేదు. ఐపీఎల్ 2021 సీజన్‌లో అతని పేలవ ప్రదర్శన నేపథ్యంలో సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత తుది జట్టులోకి కూడా తీసుకోలేదు. కనీసం ప్లేయర్ల డగౌట్‌కు కూడా అనుమతించలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సుదీర్ఘ కాలం ప్రాతినిథ్యం వహించిన వార్నర్ 2016లో ఆ జట్టుకు టైటిల్ కూడా అందించాడు.

Story first published: Monday, May 6, 2024, 18:02 [IST]
Other articles published on May 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+