Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేనేం హంతకుడిని కాదు.. ఆ శిక్ష చాలా అన్యాయం.. క్రికెట్ ఆస్ట్రేలియాపై డేవిడ్ వార్నర్ ఫైర్!

 David Warner says Im not a criminal, ban for life is harsh over his leadership ban

సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియాపై ఆ జట్టు డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం నేపథ్యంలో కెప్టెన్ కాకుండా తనపై విధించిన జీవితకాల నిషేధం చాలా అన్యాయమని అభిప్రాయపడ్డాడు. తానేం క్రిమినల్‌ను కాదని, హంతకులకు కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని అసహనం వ్యక్తం చేశాడు. ఇక 2018 సౌతాఫ్రికా పర్యటనలో యువ క్రికెటర్ బెన్ క్రాఫ్ట్‌తో బాల్ ట్యాంపరింగ్‌కు డేవిడ్ వార్నర్, అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రయత్నించడం దుమారం రేపింది. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే ఈ ఘటన ఓ మాయని మచ్చగా నిలిచిపోయింది. ప్రపంచం ముందు చీటర్స్‌గా నిలబెట్టింది. దాంతో క్రికెట్ ఆస్ట్రేలియా సైతం ఈ ముగ్గురి ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంది. ఓ ఏడాది పాటు పూర్తిగా ఏ తరహా క్రికెట్ ఆడకుండా నిషేధించిన సీఏ.. ప్రధాన కారకుడైన వార్నర్‌.. కెప్టెన్ కాకుండా జీవితం కాలం నిషేధం విధించింది.

 నేను హంతకుడిని కాదు..

నేను హంతకుడిని కాదు..

తనపై విధించిన జీవిత కాల కెప్టెన్సీ నిషేధాన్ని తొలగించాల్సిందిగా క్రికెట్ ఆస్ట్రేలియాను డేవిడ్ వార్నర్ ఇప్పటికే చాలా సార్లు కోరాడు. క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఈ విషయంలో చాలా జాప్యం చేస్తోంది. దాంతో డేవిడ్ వార్నర్, ఆసీస్ క్రికెట్ బోర్డు తీరుపై ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ స్పోర్ట్స్ చానెల్‌కు ఇచ్చి ఇంటర్వ్యూలో.. 'నేను క్రిమినల్‌ను కాదు. ఏదో ఒక స్టేజీ దాటిన ప్రతీ ఒక్కరికీ అప్పీలు చేసుకునే అవకాశం ఉండాలి. కొంతకాలం పాటు బ్యాన్ వేస్తే తప్పు లేదు, కానీ జీవితకాలమంతా కెప్టెన్సీ చేయకూడదనడం చాలా కఠినం.. చాలా రోజులుగా బ్యాన్ ఎత్తివేస్తారని ఎదురుచూస్తున్నా.

దాన్ని సాకుగా చూపించి..

దాన్ని సాకుగా చూపించి..

ఈ ఏడాది ఫ్రిబవరిలో నాపై నిషేధం ఎత్తివేస్తారని అనుకున్నా, కానీ అలా జరగలేదు. ఇది నాకూ, నా కుటుంబానికి, ఈ వివాదంలో ఇరుక్కున్న వారందరికీ చాలా కష్టంగా ఉంది. జరిగిపోయినదాన్ని ఇప్పుడు క్షుణ్ణంగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందో మళ్లీ చెప్పాల్సిన పని లేదు. ఫించ్ రిటైర్ అయిన తర్వాత నాకు కెప్టెన్సీ దక్కుతుందని ఆశించా. నాపైన వేసిన కెప్టెన్సీ బ్యాన్‌ను ఎత్తివేస్తారని అనుకున్నా. కానీ అలా జరగలేదు. 2018లో నాలుగేళ్ల క్రితం జరిగినదాన్ని సాకుగా చూపించి, ఇప్పుడు కెప్టెన్సీకి అర్హుడు కాదని చెప్పడం అసహనానికి గురి చేస్తోంది.'అని వార్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

 ముగ్గురు సభ్యుల ప్యానెల్..

ముగ్గురు సభ్యుల ప్యానెల్..

ఆరోన్ ఫించ్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వార్నర్‌కే సారథ్య బాధ్యతలు దక్కుతాయని అంతా భావించారు. క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం

వార్నర్‌ని పక్కనబెట్టి ప్యాట్ కమ్మిన్స్‌కి వన్డే కెప్టెన్సీ అప్పగించింది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వన్డే కెప్టెన్సీ బాధ్యతలు వార్నర్‌కే ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించిన నేపథ్యంలో సీఏ.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. జీవిత కాల నిషేధంపై ముగ్గురు సభ్యుల ప్యానెల్‌కు వార్నర్ అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తూ సీఏ తాజాగా నిర్ణయం తీసుకుంది.

Story first published: Monday, November 21, 2022, 17:37 [IST]
Other articles published on Nov 21, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+