Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సతీమణి క్యాండిస్‌కు తెలుగులో ప్రపోజ్ చేసిన డేవిడ్ వార్నర్.. ఫ్యాన్స్ ఫిదా!

David Warner says ‘I love you’ to wife Candice in Telugu

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి తెలుగు అభిమానులను ఆకట్టుకున్నాడు. తన సతీమణి క్యాండిస్ వార్నర్‌కు తెలుగులో ప్రపోజ్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన సతీమణీతో ఉన్న ఓ పెయింట్ ఫొటోను పంచుకున్న డేవిడ్ భాయ్.. దానికి క్యాప్షన్‌గా 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను'అని పేర్కొన్నాడు. ఈ పెయింట్ ఫొటోలో క్యాండిస్‌ను వార్నర్‌ ఎత్తుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక ఈ పోస్ట్‌పై క్యాండీస్ కూడా స్పందించింది. లవ్ ఏమోజీలను కామెంట్ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేసింది. ఇక వార్నర్ తెలుగులో ప్రపోజ్ చేయడం పట్ల హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

David Warner says ‘I love you’ to wife Candice in Telugu

వార్నర్ ఇలా తెలుగు అభిమానులను అలరించడం ఇదే తొలిసారి కాదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్‌గా తెలుగు ప్రజలతో మమేకమైన వార్నర్.. గతంలో తెలుగు సినిమాల డైలాగ్‌లు, పాటలకు చిందేశాడు. ఫ్యామిలీ మొత్తం కలిసి టిక్ టాక్ వీడియోలతో అలరించింది. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ హిట్ సాంగ్ 'బుట్ట బొమ్మ'కు వార్నర్ ఫ్యామిలీ చేసిన టిక్ టాక్ వీడియో నెట్టింట హల్‌చల్ చేసింది. ఎంతలా అంటే ఈ వీడియోకు అల్లు అర్జునే స్పందించేంత. ఇక వార్నర్ డైలాగ్స్‌కు ఫిదా అయిన టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తన సినిమాల్లో అవకాశం కూడా ఇస్తానని తెలిపాడు. గతేడాది లాక్‌డౌన్ ఫుల్‌ ఎంటర్‌టైన్ చేసిన వార్నర్.. తాజాగా మళ్లీ అదే దారిలో నడుస్తున్నాడు.

కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ ఆగిపోవడంతో స్వదేశం వెళ్లిపోయిన వార్నర్.. ఈ విశ్రాంతి సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతున్నాడు. అయితే ఈ సీజన్‌లో వార్నర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. ఈ పేలవ ప్రదర్శనకు వార్నర్‌ను బాధ్యుణ్ని చేస్తూ టీమ్ మేనేజ్‌మెంట్ అతని కెప్టెన్సీపై వేటు వేసింది. కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయితే యూఏఈ వేదికగా జరిగే సెకండాఫ్‌లోనైనా వార్నర్ చెలరేగాలని అతని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Story first published: Thursday, May 27, 2021, 18:59 [IST]
Other articles published on May 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+