Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా వయసు ఏం పెరగలేదు.. కుర్రాళ్లు నాతో గెలవలేరు: డేవిడ్ వార్నర్

David Warner says Extra Motivation For Me Is Winning In India Ahead Of Border Gavaskar Trophy

మెల్‌బోర్న్: తన వయసు ఏం పెరగలేదని, జట్టులో ఉన్న కుర్రాళ్లు తనతో పోటీ పడలేరని ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడిన వార్నర్‌.. సౌతాఫ్రికాతో సిరీస్‌లో టచ్‌లోకి వచ్చాడు. ఇటీవల ముగిసిన బాక్సింగ్‌ డే టెస్టులో డబుల్ సెంచరీ బాది ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయానంతరం మాట్లాడిన వార్నర్.. ఇంతటితో ముగియలేదని, తాను సాధించాల్సింది చాలా ఉందని పేర్కొన్నాడు. వచ్చే ఏడాది జరగనున్న బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ, యాషెస్‌ సిరీస్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, ఈ సిరీస్‌లలో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే తనలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని పేర్కొన్నాడు.

 కుర్రాళ్లు పోటీపడలేరు..

కుర్రాళ్లు పోటీపడలేరు..

'మీరు నా వయస్సు గురించి మాట్లాడటం మానేయాలని కోరుకుంటున్నాను. నాకు 36 ఏళ్లు ఉన్నట్లు అనిపించడం లేదు. జట్టులో ఉన్న చాలా మంది యువ ఆటగాళ్ల కంటే వేగంగా పరిగెత్తుతున్నాను. కాబట్టి వారు నన్ను అందుకున్నప్పుడు వయసు గురించి ఆలోచించాలి. భారత్‌‌లో విజయం సాధించడం, ఇంగ్లండ్‌‌లో సిరీస్‌ను పూర్తిగా గెలిస్తే నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.

విఫలమైతే వచ్చే జోకులు తెలుసు..

విఫలమైతే వచ్చే జోకులు తెలుసు..

ఆ రెండు సిరీస్‌లకు సిద్ధంగా ఉండాలని కోచ్, సెలక్టర్లు నాకు చెప్పారు. నేను జట్టుకు ఎలాంటి శక్తిని తీసుకురాగలనో నాకు ఇప్పటికీ తెలుసు. పరుగులు చేయాలనే ఆకలి నాకింకా ఉంది. ఎందుకంటే నేను ప్రతిసారీ నేర్చుకుంటూనే ఉంటా. ఒక్కసారి నేను విఫలమడం ప్రారంభమైతే నన్ను విమర్శించడానికి, జోకులు వేయడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు' అని వార్నర్‌ చెప్పుకొచ్చాడు.

 భారత్‌తో గెలవడం కష్టం..

భారత్‌తో గెలవడం కష్టం..

ఫిబ్రవరి 9 నుంచి భారత్‌, ఆసీస్‌ మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ (బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ) ప్రారంభంకానుంది. నాగ్‌పూర్‌, ఢిల్లీ, ధర్మశాల, అహ్మదాబాద్‌లలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌ గురించి వార్నర్‌ మాట్లాడుతూ.. 'మేము ఎలాంటి సవాల్‌ను ఎదుర్కొబోతున్నామో మాకు తెలుసు. అక్కడ (భారత్‌)లో వేదికలు భిన్నంగా ఉంటాయి. నాగ్‌పూర్, దిల్లీ పిచ్‌లు చాలా పొడిగా ఉంటాయి. చివరగా ధర్మశాలలో మేం ఆడిన టెస్టులో గెలవాల్సి ఉంది. కానీ, ఓడిపోయాం' అని డేవిడ్‌ వార్నర్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, December 31, 2022, 20:07 [IST]
Other articles published on Dec 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+