Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీ 2031 వన్డే ప్రపంచకప్ కూడా ఆడగలడు: డేవిడ్ వార్నర్

టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్‌ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ ఫ్రీక్ అని కొనియాడాడు. అతనికి ఉన్న ఫిట్‌నెస్‌తో 2031 వన్డే ప్రపంచకప్ ఆడగలడని అభిప్రాయపడ్డాడు. ట్విటర్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన వార్నర్.. వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చాడు.

ఈ సందర్భంగా ఓ అభిమాని విరాట్ కోహ్లీ 2031 వన్డే ప్రపంచకప్‌లోనూ చూడాలని ఉందని ఆకాంక్షించాడు. దానికి డేవిడ్ వార్నర్ తనదైన శైలిలో బదులిచ్చాడు. 'విరాట్ కోహ్లీని వద్దనడానికి కారణమేదీ కనిపించడం లేదు. అతని ఫిట్‌నెస్ స్థాయి ఉన్నతంగా ఉంటుంది. ఆటను ఎంతో ప్రేమిస్తాడు.'అని వార్నర్ బదులిచ్చాడు.

 David Warner say Virat Kohli Can Play Till 2031 World Cup

మరోవైపు వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఆడుతాడా? లేదా? అనేది సందేహంగా మారింది. వన్డే ప్రపంచకప్ పరాజయం అనంతరం కోహ్లీ వైట్ బాల్ క్రికెట్‌కు బ్రేక్ తీసుకున్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో కూడా పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనని బోర్డుకు సమాచారమిచ్చాడు. రెడ్ బాల్ క్రికెట్‌లోనే కొనసాగాలని కోహ్లీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు అభిమానులు, మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ 2024 కూడా ఆడాలని సూచిస్తున్నారు. వార్నర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 2031 వన్డే ప్రపంచకప్ కూడా ఆడే సత్తా అతనికి ఉందని కితాబిచ్చాడు.

2027 ప్రపంచకప్ ఆడగలరా? అని మరో అభిమాని వార్నర్ ప్రశ్నించగా.. 2031 వన్డే ప్రపంచకప్ కూడా ఆడుతానని చమత్కరించాడు. డేవిడ్ వార్నర్ వయసు 37 కాగా.. విరాట్ కోహ్లీ ఇటీవలే 35వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు.

వన్డే ప్రపంచకప్ 2023లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అందుకున్నాడు. వన్డేల్లో 50వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ 2027 ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Story first published: Saturday, December 2, 2023, 19:04 [IST]
Other articles published on Dec 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+