కెప్టెన్సీపై వేటు.. డేవిడ్ వార్నర్ ఇన్‌స్టా స్టోరీస్ వైరల్!

హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్‌లో నిరాశజనక ప్రదర్శన కనబరుస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ వైఫల్యాలకు కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను బాధ్యుడ్ని చేస్తూ అతనిపై వేటు వేసింది. వార్నర్ స్థానంలో లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ప్రకటించింది. ఇప్పటి వరకు సన్‌రైజర్స్ 6 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో ఓడిపోయి కేవలం ఒక మ్యాచ్‌లో గెలిచింది. తమ అధికారిక ప్రకటనలో వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై సన్‌రైజర్స్ యాజమాన్యం ఎలాంటి కారణాన్ని వెల్లడించలేదు.
ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్ నుంచి సీజన్ ముగిసేవరకు విలియమ్సన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని మాత్రమే పేర్కొంది. అయితే ఈ నిర్ణయం అంత సులువుగా తీసుకోలేదని, సుదీర్ఘ కాలంగా జట్టులో కీలకపాత్ర పోషించిన వార్నర్ అంటే తమకు గౌరవం ఉందన్న ఫ్రాంచైజీ... మున్ముందు జట్టు పురోగతిలో అతను కూడా కీలకపాత్ర పోషిస్తాడని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది.

వార్నర్ రియాక్షన్ కోసం..
అయితే కేన్ మామకు కెప్టెన్సీ ఇవ్వడాన్ని ఎవరూ తప్పుబట్టకపోయినా ఇలా అర్థాంతరంగా తప్పించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు అతను చేసిన సేవలను గుర్తిస్తూ గౌరవంగా తప్పించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రకటన అనంతరం డేవిడ్ వార్నర్ ఎలా స్పందిస్తాడోననే ఆసక్తి అందరిలో నెలకొంది.
అభిమానులంతా అతని సోషల్ మీడియా అకౌంట్లను చెక్ చేయగా.. ఈ ఆసీస్ స్టార్ ఇన్‌స్టా స్టోరీలో కొన్ని ఫొటోలు పంచుకున్నాడు. హైదరాబాద్‌లో ప్రేక్షకుల మధ్య ఆడే అనుభూతిని మిస్సవుతున్నానని పేర్కొన్న వార్నర్.. మరో ఫొటోలో ఓ అభిమాని గీసిన పెయింటింగ్ ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం ఈ రెండు ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

ఓటమికి బాధ్యత వహించడం..
బుధవారం చెన్నైతో మ్యాచ్ ఓడిన తర్వాత వార్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసినా... వార్నర్ తన శైలికి భిన్నంగా చాలా నెమ్మదిగా ఆడాడు. ఈ పరాజయానికి తనదే పూర్తి బాధ్యత అని చెప్పాడు. తన బ్యాటింగ్ తీరు తీవ్ర అసహనం కలిగించిందంటూ ఓటమి భారాన్ని తనపైనే వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మనీశ్ పాండే కూడా హాఫ్ సెంచరీ చేశాడు. అయితే దీనికి ముందు ఢిల్లీ చేతిలో ఓడినప్పుడు పాండే గురించి వార్నర్ చేసిన వ్యాఖ్యలు యాజమాన్యానికి ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం.

సరైన సమయం చూసి..
'పాండేను సెలక్టర్లు పక్కన పెట్టడం తప్పుడు నిర్ణయం' అంటూ అతను వ్యాఖ్యానించాడు. లీగ్ క్రికెట్‌లో సెలక్టర్లు అంటూ ప్రత్యేకంగా ఉండరు కాబట్టి పాండేను తప్పించాలనేది టీమ్ యాజమాన్యం నిర్ణయమే కావచ్చు. దీనిని విభేదించడంతో పాటు బ్యాటింగ్‌లో కూడా వార్నర్ తడబడుతుండటంతో రైజర్స్ యాజమాన్యం ఇదే అవకాశంగా అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించాలని భావించి ఉండవచ్చు. ఆరు మ్యాచ్‌లలో అతని స్కోర్లు 3, 54, 36, 37, 6, 57గా ఉండగా స్ట్రయిక్‌రేట్ 110.28గా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications