Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంతి తాకలేదనే అసహనంతో బ్యాట్‌‌ను నేలకు కొట్టిన వార్నర్ డాటర్ (వైరల్ వీడియో)

David Warners Daughter Ivy Reacts Furiously After Failing To Hit Ball

సిడ్నీ: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. తన కూతురు ఇవీకి సంబంధించిన ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా, ఇవీకి సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పుడిది నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఆ వీడియో ఏంటంటే..
నెట్స్‌లో బ్యాట్ పట్టుకుని ఇవీ క్రికెట్ ఆడుతోంది. అయితే, ఓ బంతిని కొట్టే ప్రయత్నంలో అది బ్యాట‌్‌కు తగలకుండా మిస్సయ్యింది. అంతే.. ఆ చిన్నారి కోపంతో అరుస్తూ బ్యాట్‌ను నేలకు కొట్టింది. ఈ వీడియోకు ఐవీ తన భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందని వార్నర్ క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఈ వీడియోను సుమారు మూడు లక్షల మంది చూశారు. నెటిజన్లు ఈ వీడియోకు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చిన్నప్పటి కోహ్లీ అని కొందరంటే.. ఇంకొందరేమో అటిట్యూడ్‌కు ప్రచారకర్తని కామెంట్ చేస్తున్నారు.ఇంకొందరు ఇతరులతో ఎందుకు పోలుస్తారని, ఆమెకు సొంత గుర్తింపు ఉండనివ్వాలని అంటున్నారు.

ఇక ఇండియాతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో డేవిడ్ వార్నర్ సెంచరీతో మెరిసిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో పించ్‌, వార్నర్( 128 నాటౌట్‌) అజేయ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో వార్నర్ విఫలమయ్యాడు. ఇక భారత్ కూడా అద్భుత ప్రదర్శనతో కంగారులను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Story first published: Monday, February 3, 2020, 21:43 [IST]
Other articles published on Feb 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+