కూతుళ్లు మళ్లీ అదరగొట్టారు.. హ్యాట్రిక్ మిస్ చేసిన వార్నర్!!

సిడ్నీ: కరోనా వైరస్ లాక్డౌన్ కాలంలో తన డ్యాన్స్‌లు, సరదా వీడియోలతో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా స్టార్ అయ్యాడు. తెలుగు, తమిళ్, హిందీ పాటలకు భార్య, కూతుళ్లతో కలిసి డ్యాన్స్‌లు చేసి భారత అభిమానులను ఎలా మురిపించాడో అందరికీ తెలిసిందే. టిక్‌టాక్‌లో సతీమణి క్యాండిస్ వార్నర్‌తో కలిసి బుట్టబొమ్మ, రాములో రాములా, బ్యాంగ్‌బ్యాంగ్ వంటి పాటలకు వార్నర్ స్టెప్పులేశాడు. ఇప్పుడు భారత్‌లో టిక్‌టాక్‌ను నిషేధించారు. అయినప్పటికీ.. వార్నర్ ఇతర సోషల్‌మీడియా వేదికల ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉన్నాడు.

హ్యాట్రిక్ మిస్ చేసిన వార్నర్:
డేవిడ్ వార్నర్ తాజాగా తన కుమార్తెలు ఇండి రే, ఇవీ మేలతో కలిసి ఇంట్లోనే సరదాగా క్రికెట్ ఆడాడు. ఇవీ బ్యాటింగ్ చేస్తుండగా.. వార్నర్ బౌలింగ్ (త్రో) చేశాడు. వార్నర్ విసిరిన బంతులను ఇవీ అద్భుతంగా బాదింది. అయితే ఇవీ కొట్టిన బంతులను వరుసగా రెండు క్యాచులు అందుకున్న వార్నర్.. మూడో బంతికి హ్యాట్రిక్ సాధించాలనుకున్నాడు. కానీ ఇవీ మూడో బంతిని లెగ్‌సైడ్ కొట్టింది. వార్నర్ డైవ్ చేసి మరి క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆసీస్ ఓపెనర్ హ్యాట్రిక్ మిస్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.
గోల్ఫ్ ఆడిన ఇవీ:
మరో వీడియోలో ఇవీ గోల్ఫ్ ఆడింది. ఇవీ మే గోల్ఫ్ బంతిని కొట్టిన విధానం చూసి డేవిడ్ వార్నర్ ఆశ్చర్యపోయాడు. ఎంత అద్భుతంగా స్వింగ్ చేసిందో అని ఆనందం వ్యక్తం చేశాడు. ఆ స్వింగ్ చూసి తనకు ఈర్ష్య కలిగిందని కూడా వార్నర్ చెప్పాడు. లాక్‌డౌన్‌లో తన కుమార్తెల మధ్య బంధీ అయ్యానని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ చెప్పాడు. అంతర్జాతీయ కెరీర్‌లో వార్నర్ ఇప్పటివరకు 84 టెస్టుల్లో, 123 వన్డేల్లో, 79 టీ20 మ్యాచ్‌ల్లో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

బాలీవుడ్ పాటకు వార్నర్ కూతుళ్ల డ్యాన్స్:
మరో వీడియోలో వార్నర్ కూతుళ్లు ఇండి రే, ఇవీ మే తండ్రి లేకుండానే సొంతంగా ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన హౌస్‌ఫుల్-4 చిత్రంలోని 'బాల' పాటకు చిందులేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వార్నర్.. 'కూతుళ్లు సొంతంగా డ్యాన్స్ చేయాలనుకున్నప్పుడు' అంటూ రాసుకొచ్చాడు. కాగా వార్నర్ గతంలోనే ఈ పాటకు డ్యాన్స్ చేయగా.. అభిమానులు లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపించారు. ఇప్పుడు మళ్లీ అతడి కూతుళ్లు ఇదే సాంగ్‌కు స్టెప్పులు వేశారు.

మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దాంతో మరికొన్ని రోజుల వరకు అక్కడ క్రికెట్ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇక ఆస్ట్రేలియాలో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరగడం కూడా అనుమానంగానే ఉంది. మరోవైపు భారత్‌లో ఐపీఎల్ 2020 జరగడానికి సమయం పట్టేట్టు ఉంది. దీంతో డేవిడ్ వార్నర్ మైదానంలోకి దిగాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
అందులో ఉన్న మజాని ఆస్వాదించడం జొరావర్‌కు నేర్పిస్తున్నా: ధావన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications