కొడుక్కి గుర్రపు స్వారీ నేర్పిన గబ్బర్
శిఖర్ ధావన్ తన కుమారుడు జొరావర్‌కు గుర్రపు స్వారీ నేర్పిస్తున్న వీడియోను బుధవారం ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. వీడియోలో జొరావర్‌కు శిఖర్ గుర్రపు స్వారీ నేర్పించాడు. ఇద్దరూ కలిసి తమ ఇంటి సమీపంలో గుర్రంపై సరదాగా విహరించారు. 'గుర్రపు స్వారీ చేయడంలో ఉన్న మజాని ఆస్వాదించడం జొరావర్‌కు నేర్పిస్తున్నాను. తన కొత్త మిత్రుడితో సమయాన్ని బాగా ఎంజాయ్ చేశాడు' అని గబ్బర్ వీడియోకి కాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.

జొరావర్‌తో కలిసి చిందులు
తాజాగా శిఖర్ ధావన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో పంజాబీ పాట ఆజ్ నచ్‌లేకు తన కొడుకు జొరావర్‌తో కలిసి చిందులు వేశాడు. భార్య ఆయేషాను సైతం తనతో కలిసి కాలు కదపాలని సైగ చేశాడు. అయితే సోఫాలో హాయిగా కూర్చున్న ఆమె.. రానంటే రానని మొండికేసింది. కూర్చున్నచోట నుంచి అంగుళం కూడా జరగలేదు. దాంతో.. 'భార్యను ఒప్పించాలంటే కొడుకు మద్దతు ఉండాల్సిందే' అని ధావన్ అన్నాడు.

కొడుక్కి అన్నీ నేర్పిస్తున్న గబ్బర్
కరోనా వైరస్ పుణ్యమాని ప్రస్తుతం ఖాళీ సమయం దొరకడంతో శిఖర్ ధావన్ తన కొడుక్కి అన్నీ నేర్పిస్తున్నాడు. ఇంటి పనుల్లో సాయం చేయిస్తున్నాడు. సైకిల్ తొక్కడం నేర్పిస్తున్నాడు. ఇంకా పరుగెత్తిస్తున్నాడు. కొన్ని రోజుల ముందు ట్రిమ్మర్‌తో తన జట్టును స్టైలిష్‌గా చేయించుకున్నాడు. అంతకుముందు మేకప్ కూడా వేసుకున్నారు. అంతర్జాతీయ కెరీర్‌లో గబ్బర్ ఇప్పటివరకు 34 టెస్టుల్లో, 136 వన్డేల్లో, 61 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

గాయాల కారణంగా:
చేతి వేలి గాయం కారణంగా 2019 వన్డే ప్రపంచకప్ నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేసిన ధావన్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ (రాజ్‌కోట్ వన్డే) గాయపడ్డాడు. ప్రపంచకప్ నుంచి ధావన్ గాయపడడం అది నాలుగోసారి. గాయాల కారణంగా గబ్బర్ గత సంవత్సర కాలంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. కోలుకున్న గబ్బర్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా.. వర్షం, కరోనా కారణంగా మూడు వన్డేలు రద్దయ్యాయి.
'మిగతా కెప్టెన్‌ల కంటే గంగూలీ స్టయిలే వేరు.. టైమ్ చూసుకుని టాస్‌కి వెళ్లేవాడు'


Click it and Unblock the Notifications












