Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే పృథ్వీ షాను తీసుకున్నాం: డేవిడ్ వార్నర్

ధర్మశాల: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కొత్త పిచ్ కావడంతో పాటు డ్యూ వచ్చే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం.

ఇది న్యూట్రాక్. ఎలా స్పందిస్తుందో చూడాలనుకుంటున్నాం. మా ప్లే ఆఫ్స్ రాత మా చేతుల్లోనే ఉంది. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా మ్యాచ్ బరిలోకి దిగి ఈ సాయంత్రాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాం. ప్రశాంతంగా ఉంటూ మా ఆట మేం ఆడాలనుకుంటున్నాం. జట్టులో రెండు మార్పులు చేశాం. అథర్వ టైడే, కగిసో రబడా జట్టులోకి వచ్చారు. 'అని ధావన్ తెలిపాడు.

David Warner Shikhar Dhawan

మరోవైపు టాస్ గెలిస్తే తాము బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని ఢిల్లీ క్యాపిటల్స్ సారథి డేవిడ్ వార్నర్ అన్నాడు. డ్యూ వచ్చే అవకాశం ఉందని, మ్యాచ్ అసాంతం ఉంటుందని చెప్పాడు. తప్పని పరిస్థితుల్లో జట్టులో మార్పులు చేయాల్సి వచ్చిందన్న డేవిడ్ వార్నర్.. మిచెల్ మార్ష్ గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని చెప్పాడు.

అతని స్థానంలో పృథ్వీ షా జట్టులోకి వచ్చాడని చెప్పాడు. పేలవ ప్రదర్శనతో తుది జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షా.. ఎట్టకేలకు అవకాశం అందుకున్నాడు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ తప్పుకోగా.. పంజాబ్ కింగ్స్‌కు అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలవడం ఆ జట్టుకు తప్పనిసరి.

తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), పృథ్వీ షా, ఫిలిప్ సాల్ట్(కీపర్), రిలీ రోసౌ, అక్షర్ పటేల్, ఆమన్ హకీమ్ ఖాన్, యశ్ ధుల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్(కెప్టెన్), అథర్వ టైడే, లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, సామ్ కరణ్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబడా, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్

Story first published: Wednesday, May 17, 2023, 19:33 [IST]
Other articles published on May 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+