Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టిక్‌టాక్‌తో వినూత్నంగా తనకిష్టమైన ఫార్మాట్ ఏంటో చెప్పిన వార్నర్!

David Warner Reveals His Favourite Cricket Format In New Video

సిడ్నీ: కరోనా వైరస్ పుణ్యమా ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టిక్‌టాక్ హీరో అయ్యాడు. వరుస వీడియోలతో దుమ్ములేపుతున్న ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ తనదైన శైలిలో వీడియోలు చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకంటుకుంటున్నాడు. బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్ సాంగ్స్‌పై సతీమణి క్యాండిస్‌తో కలిసి టిక్‌చేసిన వార్నర్ తాజాగా.. తనకిష్టమైన ఫార్మాట్ గురించి తెలిపాడు.

ఇది కూడా టిక్‌టాక్ స్టైల్లోనే ఓ వీడియో ద్వారా తెలియజేశాడు. ఈ వీడియోలో అద్దం ముందు వార్నర్ నిలుచొని ఉంటే.. అద్దంలో అతని ప్రతిరూపం మూడు ఫార్మాట్ల ఆస్ట్రేలియా జెర్సీల్లో కనిపిస్తుంది. ముందు టీ-20, ఆ తర్వాత వన్డే, చివరిగా టెస్ట్ జెర్సీలో అతను కనిపిస్తాడు. అయితే టెస్ట్ జెర్సీ రాగానే.. వార్నర్ ఆనందంతో గంతులు వేస్తాడు. దీంతో టెస్ట్ ఫార్మాట్ అంటే తనకు ఇష్టమని వార్నర్ పరోక్షంగా చెప్పాడు. ఇక ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వార్నర్.. 'నా ఫేవరేట్ క్రికెట్ ఫార్మాట్ ఏంటో ఈ వీడియోలో తెలుస్తుంది. మీరేం అనుకుంటున్నారు?'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

ఇటీవల మహేశ్ బాబు సూపర్ హిట్ మూవీ సరిలేరు నీకెవ్వరూ చిత్రంలోని మైండ్ బ్లాక్ సాంగ్‌కు వార్నర్ టిక్ టాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే డ్యాన్స్‌ రూపంలో కాకుండా కాస్త వెరైటీగా.. మైండ్ బ్లాక్ అనే సాంగ్‌లో వాడిని కొట్ట‌మ‌ని చెప్పు అనే పదాలకు టిక్ టాక్ చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేస్తున్న‌ట్టు ఫోజిచ్చిన వార్న‌ర్ త‌ర్వాత మాయ‌మైయ్యాడు. 'ఇది నా షాడో బ్యాటింగ్, ఇంట్లో భార్య ,పిల్లలు ఉండటం మీరు చూశారు కదా, మళ్ళీ కలుద్దాం'అని ఆ వీడియోకి క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

ఇక ఈ వీడియోను చూసిన ఆ మూవీ హీరోయిన రష్మిక మందన్న వార్నర్ పెర్ఫామెన్స్‌కు ఫిదా అయింది. వెంటనే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌ను కొనియాడింది. అంతేకాకుండా ఆ వీడియోకు వార్నర్ ఇచ్చిన క్యాప్షన్ చదివితే నవ్వు ఆగడంలేదని చెప్పుకొచ్చింది. 'డేవిడ్ వార్నర్ చంపేసావ్‌పో.. క్యాప్షన్ చదవుతుంటే నవ్వు ఆగడం లేదు'అని రాసుకొచ్చింది.

Story first published: Wednesday, May 27, 2020, 21:39 [IST]
Other articles published on May 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+