Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా ‘బ్యాట్‌’సాము జడేజాలా ఉందా: వార్నర్

David Warner replicates Ravindra Jadejas sword-celebration in throwback video

హైదరాబాద్: కరోనాతో ఇంటికే పరిమితమైన ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. ముఖ్యంగా తాను ఐపీఎల్‌ను ఎంత మిస్సవుతున్నానో అనే విషయాన్ని పరోక్షంగా తన పోస్ట్‌ల ద్వారా తెలియజేస్తున్నాడు. మొన్న ఐపీఎల్‌లో బెస్ట్ మూమెంట్ అని ఓ ఫొటోను షేర్ చేసిన వార్నర్.. తాజగా తన ఐపీఎల్ ఫ్యాన్స్‌కు ఓ చిలిపి ప్రశ్న వేసాడు.

ఇది నా బ్యాట్‌సాము..

ఇది నా బ్యాట్‌సాము..

మ్యాచ్ విన్నింగ్ ప్ర‌ద‌ర్శ‌న చేసినా.. వ్య‌క్తిగ‌త మైలురాళ్ల‌ను చేరుకున్నా టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా మైదానంలో బ్యాట్‌సాము చేసే విష‌యం అంద‌రికీ తెలిసిందే. బ్యాటింగ్‌లో అర్ధ‌శ‌త‌కం చేసినా సెంచరీ బాధినా.. జ‌డ్డూ బ్యాట్‌ను క‌త్తిలా తిప్పుతూ సంబరాలు చేసుకుంటాడు. అయితే తాను కూడా బ్యాట్ సాము చేసాన‌ని.. అది జ‌డేజాలా ఉందో లేదో మీరే చెప్పండి అని ఈ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ ఓ త్రో బ్యాక్ వీడియోతో ఫ్యాన్స్‌ను ప్రశ్నించాడు. గ‌తేడాది ఐపీఎల్ సంద‌ర్భంగా తీసిన కమర్షియల్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. ‘గ‌తేడాది ఇదే స‌మ‌యంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌ఫున వాణిజ్య కార్య‌క్ర‌మంలో భాగంగా ఈ క‌త్తిసాము (బ్యాట్‌సాము) చేశాను. ఇది జ‌డేజాలానే ఉందా ఓసారి చెప్పండి'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

క్లార్క్ చెప్పింది కరెక్టే..

క్లార్క్ చెప్పింది కరెక్టే..

అయితే అభిమానుల మాత్ర భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరూ సూపర్ అంటే.. మరికొందరూ జడేజాను అనుకరించడం కష్టమని కామెంట్ చేశారు. మరికొంత మంది ఐపీఎల్ కోసమే ఆస్ట్రేలియా క్రికెటర్లు భారత్ క్రికెటర్ల ఏమనడం లేదని ఆ దేశ మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. ఇంకొంతమంది వార్నర్ నిన్ను మిస్సవుతున్నామని కామెంట్ చేస్తున్నారు.

వైద్య‌ సిబ్బందికి మ‌ద్ద‌తుగా గుండు..

వైద్య‌ సిబ్బందికి మ‌ద్ద‌తుగా గుండు..

క్ష‌ణం తీరిక‌లేకుండా ప్ర‌జ‌ల ప్రాణాల కోసం త‌మ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి పోరాడుతున్న వైద్య‌, పోలీస్ సిబ్బందికి సంఘీభావంగా డేవిడ్ వార్న‌ర్ మంగ‌ళ‌వారం గుండు చేసుకున్నాడు. ఇంట్లోని ట్రిమ్మర్ సాయంతో వార్నర్ తన జుట్టును కత్తిరించుకున్నాడు. కరోనాను స‌మ‌ర్థంగా నిలువ‌రించ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారికి ఇది నా మ‌ద్ద‌తు అని ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వీడియోను పోస్ట్ చేశాడు.

స్మిత్, కోహ్లీలకు సవాల్..

స్మిత్, కోహ్లీలకు సవాల్..

తన‌లా చేయాలంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు స‌హ‌చ‌ర ఆసీస్ క్రికెట‌ర్లు పాట్ కమ్మిన్స్, జో బర్న్స్, ఆడమ్ జాంపా, మార్కస్ స్టోయినిస్‌, స్టీవ్‌ స్మిత్‌కు స‌వాల్ విసిరాడు. 'క‌రోనాపై పోరాడుతున్న వారికి మ‌ద్ద‌తుగా నిలిచేందుకు ఇలా త‌ల వెంట్రుక‌లు షేవ్ చేసుకున్నాను. నాలాగా చేయాలంటూ విరాట్‌, స్మిత్‌కు చాలెంజ్ చేశాను' అని వార్న‌ర్ త‌న ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.

Story first published: Wednesday, April 8, 2020, 21:57 [IST]
Other articles published on Apr 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+