Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

David Warner: నీ అవ్వ తగ్గేదేలే! పుష్పాను వదలని సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్! బాగానే ఉన్నావా? అంటూ కోహ్లీ సెటైర్

David Warner recreates Allu Arjun’s Pushpa song

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమా పాటలకు చిందేసిన వార్నర్ భాయ్.. మరెన్నో డైలాగ్స్‌కు లిపి సింక్ ఇచ్చాడు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అప్‌కమింగ్ మూవీ 'పుష్పా'ను కూడా ఈ ఆసీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ విడిచిపెట్టలేదు. ఓ వైపు ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్‌లో బిజీగా ఉంటూనే.. తెలుగు సినిమా అప్‌డేట్స్‌ను ఫాలో అవుతున్నాడు.

ఈ క్రమంలోనే ఫేస్ యాప్ టెక్నాలజీ సాయంతో పుష్ప సినిమాలోని 'యే బిడ్డా.. ఇది నా అడ్డా'అనే పాటను ఇమిటేట్ చేశాడు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకొని క్యాప్షన్ ఇవ్వాలని అభిమానులను కోరాడు. ఇక ఈ వీడియోను చూసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వార్నర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. బ్రో.. నీవు బాగానే ఉన్నావ్! కదా అని ఫన్నీగా కామెంట్ చేశాడు. దీనికి వార్నర్ సైతం తనదైన శైలిలో బదులిచ్చాడు. 'నువ్వు నా తల గురించే అడుగుతున్నావని తెలుసు.. కొంచెం గొంతు పట్టేసిందంతే' అని రిప్లే ఇచ్చాడు.

ఇక సన్‌రైజర్స్ అభిమానులు అయితే ఈ వీడియోను చూసి తెగ సంతోషపడుతున్నారు. కామెంట్లతో ముంచెత్తుతున్నారు. 'కోకో కోలా పెప్సీ.. డేవిడ్ భాయ్ సెక్సీ.. వార్నర్ అంటే ఫైర్.. ఫ్లవర్ అనుకుంటివా.. 'నీ అవ్వ తగ్గేదేలే.. డేవిడ్ పుష్ప.. వార్నర్ భాయ్.. మీరు త్వరగా రిటైర్ అయి.. తెలుగు సినిమాల్లో నటించండి'అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇక గతంలో కూడా వార్నర్.. అల్లు అర్జున్ పాటకు చిందేశాడు. అలవైకుంఠపురంలోని బుట్ట బొమ్మ పాటకు సతీమణి క్యాండీస్ వార్నర్‌తో కలిసి చిందేసాడు. అప్పట్లో ఈ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. ఎంతలా అంటే ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌ తమన్‌తో పాటు హీరో అల్లు అర్జున్ స్పందించేంత పాపులర్ అయింది. తెలుగు ప్రేక్షకులకు ఇంత దగ్గరైన వార్నర్.. వచ్చే సీజన్ నుంచి హైదరాబాద్‌కు ఆడడంటే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌తో వచ్చిన విభేదాల కారణంగా వార్నర్‌ తెలుగు ప్రేక్షకులకు దూరం కానున్నాడు. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో సన్‌రైజర్స్ వార్నర్‌ను రిటైన్ చేసుకోలేదు. కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను తీసుకుంది.

David Warner recreates Allu Arjun’s Pushpa song

ఇక టీ20 ప్రపంచకప్‌లో ఫామ్ అందుకున్న డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియాకు టైటిల్‌కు అందించడంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. అదే ఫామ్‌ను ప్రస్తుత యాషెస్ సిరీస్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 94 రన్స్ చేసిన వార్నర్.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Story first published: Saturday, December 11, 2021, 19:23 [IST]
Other articles published on Dec 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+