Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

David Warner: సూర్య ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్‌లో నా పేరు లేకపోవడమా? నమ్మలేకపోతున్నా!

 David Warner reacts to Suryakumar Yadavs all-time IPL XI, says Cant believe hes left me out

కొలంబో: టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్‌పై ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. సూర్య ఆల్‌టైమ్ ఐపీఎల్‌ ఎలెవన్‌లో తన పేరు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. అతను తన పేరు విస్మరించడాన్ని నమ్మలేకపోతున్నానని ట్వీట్ చేశాడు. సూర్య ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్‌కు సంబంధించిన ట్వీట్‌కు వార్నర్.. 'సూర్య నా పేరును విస్మరించడమా'అని బదులిస్తూ కన్నీరు కార్చే ఏమోజీలను జత చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది.

హర్షా భోగ్లే కోరడంతో..

హర్షా భోగ్లే కోరడంతో..

ఇటీవలే భారత్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సూర్య.. తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. వరల్డ్ బెస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో కెరీర్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే ఫైన్ ‌లెగ్ మీదుగా భారీ సిక్స్ కొట్టి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. త్వరలోనే శ్రీలంక పర్యటన ద్వారా వన్డేల్లో కూడా అరంగేట్రం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే కోరిక మేరకు సూర్య తన ఐపీఎల్ ఆల్‌టైమ్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు.

 ధోనీకి నో చాన్స్..

ధోనీకి నో చాన్స్..

అయితే సూర్యకు హర్షా భోగ్లే రెండు కండీషన్లు పెట్టాడు. జట్టులో సూర్యకుమార్ యాదవ్‌ తప్పనిసరిగా ఉండాలన్నది మొదటిది కాగా.. ముంబై ఇండియన్స్ జట్టు నుంచి నలుగురు ఎంచుకోవాలన్నది రెండోది. ఈ నిబంధనలకి లోబడి సూర్యకుమార్ తన ఐపీఎల్ ఎలెవన్ జట్టుని ఎంపిక చేశాడు. అయితే ఆశ్చర్యకరంగా తన జట్టులో టీమిండియా దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చోటివ్వలేదు. ఓపెనర్లుగా తన కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జోస్ బట్లర్‌ను ప్రకటించడంతో మహీకి చోటు లేకుండా పోయింది. ఇక ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీని ప్రకటించిన సూర్య.. నాలుగో స్థానంలో తన పేరును సూచించుకున్నాడు.

సూర్య.. స్మార్ట్..

సూర్య.. స్మార్ట్..

అయితే ఐపీఎల్‌లో ఎన్నో రికార్డులు నమోదు చేసిన డేవిడ్ వార్నర్‌ను కాదని బట్లర్‌ను ఓపెనర్‌గా ప్రకటించడం విస్మయానికి గురి చేస్తోందని ధోనీ ఫ్యాన్స్ అంటున్నారు. ఓపెనర్‌గా బట్లర్ బదులు వార్నర్‌ను తీసుకొని ఉంటే.. కీపర్‌గా ధోనీకి చోటు దక్కేదని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరమో సూర్య సేఫ్ గేమ్ ఆడుతున్నాడని, తన భవిష్యత్తు దృష్ట్యా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటిచ్చాడంటున్నారు. ఇక్కడ కూడా చాలా తెలివిగా వ్యవహరించాడని, మూడో స్థానంలో కోహ్లీని ఉంచి, నాలుగో స్థానంలో తాను సరైనవాడినని పరోక్షంగా టీమ్‌మేనేజ్‌మెంట్‌కు చెప్పాడని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో సూర్య ఆల్‌టైమ్ ఐపీఎల్‌ ఎలెవన్ హాట్ టాపిక్‌గా మారింది.

 సూర్యకుమార్ యాదవ్ ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్:

సూర్యకుమార్ యాదవ్ ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్:

జోస్ బట్లర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, హార్దిక్ పాండ్యా, ఆండ్రీ రసెల్, రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ

Story first published: Sunday, July 11, 2021, 11:30 [IST]
Other articles published on Jul 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+