అనుమనాలన్నీ..
భారత్ పర్యటనలో గజ్జ గాయానికి గురైన డేవిడ్ వార్నర్.. పూర్తిగా నయమవ్వకుండానే టెస్ట్ సిరీస్ ఆడాడు. దాంతో గాయం తిరగబెట్టి తీవ్రమైంది. ఈ నేపథ్యంలో అతను కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఐపీఎల్ ఫస్టాఫ్ మ్యాచ్‌లు ఆడటం అనుమానమేనని ఊహాగానాలు వినిపించాయి. కానీ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపాడు. సెంచరీతో చెలరేగి ఫామ్ అందుకున్నాడు. దాంతో అతని గాయంపై జరగిన ప్రచారాలన్నీ అవాస్తవాలేనని తేలింది.

రెండు రోజుల క్రితం
రెండు రోజుల క్రితం ఐపీఎల్ 2021 సీజన్ కోసం భారత్‌కు వస్తున్నానని వార్నరే స్వయంగా వెల్లడించడంతో హైదరాబాద్ ఫ్యాన్స్ తెగ సంతోషపడ్డారు. భారత్‌కు వచ్చే ముందు వార్నర్ తన కుటుంబ సభ్యులతో గడిపాడు. తన పిల్లలతో కలిసి డిన్నర్ చేశాడు. ఈ విషయాన్ని అతనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. దాంతో ఇప్పటికే వార్నర్ భారత్‌కు వచ్చాడని అంతా భావించారు. కానీ తాజా పోస్ట్‌తో అతను ఇంకా రాలేదనే విషయం స్పష్టమైంది. ఐపీఎల్ ప్రొటోకాల్స్ ప్రకారం వార్నర్ వారం రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. ఈ లేక్కన అతను జట్టుతో కలిసే సరికి లీగ్ ప్రారంభం కానుంది.

ఏప్రిల్ 11న..
ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు జరిగే ఈ క్యాషిరిచ్ లీగ్ కోసం ఫ్రాంచైజీలన్నీ సమయాత్తం అవుతున్నాయి. ఇప్పటికే ఆటగాళ్లంతా ఆయా జట్లతో కలిసారు. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం లీగ్ ఆరంభానికి ముందు ఆటగాళ్లందరూ వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. అయితే బయోబబుల్‌లో ఉన్న ఆటగాళ్లకు మాత్రం క్వారంటైన్‌ను మినహాయించారు. చెన్నై వేదికగా జరిగే సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టనుంది. ఏప్రిల్ 11న ఇదే వేదికగా జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

జట్టుతో చేరిన నట్టూ..
సన్‌రైజర్స్ సెన్సేషన్, యార్కర్ల కింగ్ టీ నటరాజన్ గురువారం జట్టుతో కలిసాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ ట్విటర్ వేదికగా ప్రకటించింది. తమ యార్కర్ కింగ్ వచ్చాడంటూ పేర్కొంది. ఇక వ్యక్తిగత కారణాలతో ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ తప్పుకోగా జాసన్ రాయ్ జట్టులోకి వచ్చాడు. గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్.. క్వాలిఫయర్స్ 2లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఓడి ఇంటిముఖం పట్టింది.


Click it and Unblock the Notifications












