SRHతో నా ప్రయాణం ముగిసింది.. మిమ్మల్ని మిస్సవుతా.. డేవిడ్ వార్నర్ భావోద్వేగం!

దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం ముగిసిన నేపథ్యంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ భావోద్వేగానికి గురయ్యాడు. హైదరాబాద్ జట్టుతో పాటు అభిమానులను మిస్ అవుతానని తెలిపాడు. ఇన్నాళ్లు అండగా నిలిచిన అభిమానులుకు సరిపడా కృతజ్ఞతలు చెప్పలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు వార్నర్ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ను పంచుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 42 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాంతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
వాస్తవానికి ఈ మ్యాచ్‌లో వార్నర్‌కు చోటు దక్కుతుందని అందరూ భావించారు. డేవిడ్ వార్నర్‌కు ఇదే ఫేర్‌వెల్ మ్యాచ్ అనుకున్నారు. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అతనికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. కేన్ విలియమ్సన్, భువనేశ్వర్ కుమార్ గాయపడినా.. వార్నర్‌ను కాదని మనీశ్ పాండేను కెప్టెన్‌గా బరిలోకి దింపింది. దాంతోనే సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌తో వార్నర్‌కు బేధాభిప్రాయాలు ఉన్నాయనే విషయం స్పష్టమైంది.

వి మిస్ యూ..
ఇక ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు డేవిడ్ వార్నర్.. అభిమానులను ఉద్దేశించి ఇన్‌స్టా వేదికగా భావోద్వేగంతో కూడిన పోస్టు పెట్టాడు.'ఈ మధుర జ్ఞాపకాలను అందించిన మీ అందరికి ధన్యవాదాలు. అభిమానులారా.. మా జట్టు ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేసేలా మద్దతుగా నిలిచారు. మీ అభిమానానికి సరిపడా కృతజ్ఞతలు కూడా చెప్పలేకపోతున్నా. ఇదో గొప్ప ప్రయాణం. నేను, నా కుటుంబం మిమ్మల్ని మిస్ కాబోతున్నాం. 'అని వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

కెప్టెన్సీపై వేటు..
ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్‌లో సన్‌రైజర్స్ వరుస పరాజయాలను చవిచూసింది. దాంతో టీమ్ వైఫల్యాలకు బాద్యుణ్ని చేస్తూ.. డేవిడ్ వార్నర్‌పై టీమ్‌మేనేజ్‌మెంట్ వేటు వేసింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అంతేకాకుండా తుది జట్టులో నుంచి కూడా తప్పించింది. ఆ తర్వాత కేన్ మామ సారథ్యంలో ఒకే ఒక మ్యాచ్ జరగ్గా కరోనాతో లీగ్ అర్ధంతరంగా వాయిదా పడింది. ఇక యూఏఈ వేదికగా ప్రారంభమైన సెకండాఫ్ లీగ్‌లో వార్నర్‌కు మళ్లీ తుది జట్టులో అవకాశం దక్కింది. జానీ బెయిర్ స్టో చివరి క్షణంలో తప్పుకోవడంతో వార్నర్ సాహాతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు.

సెకండాఫ్‌లో విఫలం..
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతనిపై మళ్లీ వేటు వేసిన టీమ్‌మేనేజ్‌మెంట్ జాసన్‌రాయ్‌కు చాన్స్ ఇచ్చింది. అతను హాఫ్ సెంచరీతో చెలరేగడంతో వార్నర్‌కు అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాతి మ్యాచ్‌లకు మైదానంలోకి కూడా వార్నర్ రాలేదు. హోటల్ రూమ్‌కే పరిమితమయ్యాడు. మ్యాచ్ జరుగుతుండగా ఇన్‌స్టా వేదికగా సంచలన పోస్ట్‌లు షేర్ చేశాడు. ఆరెంజ్ ఆర్మీ తరఫున ఇదే నా చివరి సీజన్ కావచ్చన్నాడు. కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో మైదానానికి వచ్చినా.. అతన్ని డగౌట్‌కు అనుమతించలేదు. దాంతో చేసేదేమిలేక ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్నాడు. మరోవైపు కేన్ విలియమ్సన్ సైతం దారుణంగా విఫలమయ్యాడు. వార్నర్‌ను పక్కనపెట్టడానికి అతని బ్యాటింగ్ వైఫల్యం ఒక్కటే కారణం కాదని తెలుస్తోంది. టీమ్‌మేనేజ్‌మెంట్‌తో ఉన్న బేధాబిప్రాయాలే అతన్ని తప్పించేలా చేసాయని అర్థమవుతోంది.

2013 నుంచి..
ఇక 2013 సీజన్ నుంచి వరుసగా ప్రతి సీజన్‌లో 500 పరుగులకు పైగా పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. ఈ సీజన్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. 8 మ్యాచ్‌ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే సాధించి తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చాంపియన్‌గా నిలిపిన డేవిడ్ భాయ్.. ఆ సీజన్‌లో 848 రన్స్ చేసి ఒంటి చేత్తో విజయాన్నందించాడు. అలాంటి ఆటగాడి పట్ల సన్‌రైజర్స్ యాజమాన్యం ప్రవర్తించిన తీరు ఏ మాత్రం బాలేదని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications