Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మైండ్‌బ్లాక్ పాటతో మ్యాజిక్ చేసి.. మహేష్ బాబు ఫ్యాన్స్‌ను అలరించిన వార్నర్

David Warner Is Back With Hilarious Disappearing Act In Latest TikTok Video
David Warner Uses Mahesh Babu's 'Mind Block' Song Creatively For Shadow Batting

సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టిక్‌టాక్‌లో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా తెలుగు డైలాగ్స్, పాటలతో అదరగొడుతున్నాడు. ఇటీవల టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్నర్ 'పక్కా లోకల్'సాంగ్‌‌కు సతీమణి క్యాండిస్‌తో టిక్‌టాక్ చేసి బర్త్ డే విషెస్ తెలియజేసిన విషయం తెలిసిందే.

అంతకు ముందు అలవైకుంఠపురం మూవీలోని 'రాములో రాములా', 'బుట్టబొమ్మ' పాటలకు ఫ్యామిలీతో చిందేసి అల్లు అర్జున్‌తో పాటు అతని అభిమానులను అలరించి వారి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన ఒక్కసారి కమిటైతే 'నా మాట నేనే వినను' అనే డైలాగ్ చెప్పిన వార్నర్.. ఆ మూవీ డైరెక్టర్ పూరిజగన్నాద్ ప్రశంసలతో పాటు సినిమా ఆఫర్‌ను అందుకున్నాడు. అనంతరం బాహుబలి సినిమాలో 'అమరేంద్ర బాహుబలి అనే నేను' డైలాగ్ చెప్పి అలరించాడు.

అయితే ఈ క్రమంలో డేవిడ్ వార్నర్‌ని మహేశ్ బాబు అభిమానులు సరిలేరు నీకెవ్వరులోని 'మైండ్‌బ్లాక్' పాటకి టిక్‌-టాక్ చేయాల్సిందిగా వార్నర్‌ని అడిగారు. అయితే ఆస్ట్రేలియాలో ఆ పాట అందుబాటులో లేదని.. అందుబాటులోకి వచ్చిన వెంటనే దానిపై వీడియో చేస్తానని వార్నర్ తెలిపాడు. మొత్తానికి ఆ పాట ఆస్ట్రేలియాలో అందుబాటులోకి రావడంతో వార్నర్ దానిపై టిక్‌-టాక్ చేశాడు.

అయితే డ్యాన్స్‌ రూపంలో కాకుండా.. వార్నర్ వెరైటీగా ఈ వీడియో చేశాడు. మైండ్ బ్లాక్ అనే సాంగ్‌లో వాడిని కొట్ట‌మ‌ని చెప్పు అనే పదాలకు టిక్ టాక్ చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేస్తున్న‌ట్టు ఫోజిచ్చిన వార్న‌ర్ త‌ర్వాత మాయ‌మైయ్యాడు. 'ఇది నా షాడో బ్యాటింగ్, ఇంట్లో భార్య ,పిల్లలు ఉండటం మీరు విన్నారు కదా, మళ్ళీ కలుద్దాం'అని ఆ వీడియోకి క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. దీన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కూడా ట్యాగ్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొందరూ మాత్రం పాటలోని మహేశ్ బాబులా కాస్ట్యూమ్స్ ధరించి చేయాలని కోరుతున్నారు.

Story first published: Monday, May 25, 2020, 15:25 [IST]
Other articles published on May 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+