న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sydney Test: అయ్యో పాపం డేవిడ్ వార్నర్‌.. నాలుగేళ్లలో ఇదే తొలిసారి!!

David Warner falls inside 10 runs in a home Test for first time in 4 years

సిడ్నీ: గురువారం ఆస్ట్రేలియా-భారత్ జట్ల ప్రారంభం అయిన మూడో టెస్టు మ్యాచ్‌ తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. తొలి సెషన్‌ ఆటకు వరణుడు పదేపదే అడ్డుపడ్డాడు. వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్‌ 21/1గా ఉంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నఆస్ట్రేలియా జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. గాయం నుంచి కోలుకొని తిరిగి మూడో టెస్టు ఆడుతున్న స్టార్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్ ‌(5)ను హైదరాబాద్ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ బోల్తా కొట్టించాడు. వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని వార్నర్‌ వేటాడడంతో స్లిప్‌లో చేటేశ్వర్ పూజారా చేతికి చిక్కాడు.

నాలుగేళ్లలో ఇదే తొలిసారి:

నాలుగేళ్లలో ఇదే తొలిసారి:

డేవిడ్ వార్నర్‌ టెస్ట్ ఫార్మాట్‌లో సొంతగడ్డపై ఇలా 10 పరుగుల లోపే ఔటవ్వడం నాలుగేళ్లలో ఇదే తొలిసారి. 2016 నవంబర్‌ 12న దక్షిణాఫ్రికాతో ఆడిన టెస్టులో 1 పరుగుకే పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత మళ్లీ టీమిండియాతో ఈరోజు ప్రారంభం అయిన మూడో టెస్టులో 5 పరుగులకు ఔటయ్యాడు. వార్నర్ తన చివరి 25 హోమ్ టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 10 పరుగులకంటే ఎక్కువే చేశాడు. వార్నర్ చివరిసారిగా 2020 జనవరిలో ఇదే వేదికలో న్యూజిలాండ్‌తో హోమ్ టెస్ట్ ఆడాడు. 2వ ఇన్నింగ్స్‌లో అజేయంగా 111 పరుగులు చేశాడు. అంతకుముందు 45, 38, 41, 19, 43, 335 *, 154 స్కోర్లు నమోదు చేశాడు.

పకోస్కీతో కలిసి ఓపెనింగ్:

పకోస్కీతో కలిసి ఓపెనింగ్:

భారత్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సందర్భంగా డేవిడ్ వార్నర్‌ రెండో వన్డేలో గాయపడిన సంగతి తెలిసిందే. గజ్జల్లో గాయమవడంతో.. ఆ తర్వాత జరిగిన మూడో వన్డే, 3 టీ20ల సిరీస్‌తో పాటు తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న వార్నర్ నేరుగా సిడ్నీ టెస్టులో ఆడుతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలవడంతో.. యువ బ్యాట్స్‌మన్‌ విల్‌ పకోస్కీతో కలిసి ఓపెనింగ్‌ చేశాడు. అయితే పేలవ షాట్ ఆడి ఆదిలోనే పెవిలియన్ బాటపట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఎలా ఆడతాడో చూడాలి.

2009లో ఆరంగేట్రం:

2009లో ఆరంగేట్రం:

2009, జనవరి 11న డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా టీ20 జట్టులోకి ఆరంగేట్రం చేశాడు. 2009, జనవరి 18న వన్డేల్లోకి వచ్చాడు. న్యూజీలాండ్ జట్టుపైనే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత 2011, డిసెంబర్ 1న ఆసీస్ టెస్ట్ జట్టులో ఆరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి వెనుదిరికి చూసుకోలేదు. మద్యలో ఓ సంవత్సరం నిషేదానికి గురైనా.. అంతేవేగంగా పుంజుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో వార్నర్ ఇప్పటివరకు 84 టెస్టుల్లో, 128 వన్డేల్లో, 81 టీ20 మ్యాచ్‌ల్లో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 7244, వన్డేల్లో 5445, టీ20ల్లో 2265 రన్స్ చేశాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 43 సెంచరీలు బాదాడు.

ఆదిలోనే షాక్:

ఆదిలోనే షాక్:

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ జట్టు 6 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం విల్‌ పకోస్కీ (14)తో కలిసి మార్నస్‌ లబుషేన్ ‌(2) బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ 7.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 21 పరుగులు చేశారు. అదే సమయంలో వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లు బౌలింగ్‌ చేయగా.. మొహ్మద్ సిరాజ్‌ 3.1 ఓవర్లలో ఒక వికెట్‌ పడగొట్టాడు. ప్రస్తుతం సిడ్నీలో వర్షం తగ్గింది. అయితే మైదానం మాత్రం చిత్తడిగా మారింది. అంపైర్లు మైదాన్ని పరిశిలించిన తర్వాత ఆట ప్రారంభం అవుతుంది.

Sydney Test: జాతీయగీతం ఆల‌పించే స‌మ‌యంలో.. కన్నీరు పెట్టుకున్న మొహ్మద్ సిరాజ్‌(వీడియో)!!

Story first published: Thursday, January 7, 2021, 9:29 [IST]
Other articles published on Jan 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X