Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs SA: 100వ టెస్ట్‌లో 200 కొట్టిన డేవిడ్ వార్నర్.. చీకటి కడుపును చీల్చుకుంటూ..!

David Warner Equals Sachin Tendulkars All-Time Record after scoring double century in his 100th Test

మెల్‌బోర్న్: గత మూడేళ్లుగా ఒక్క టెస్ట్ సెంచరీ లేదు.. ఈ సమ్మర్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.. ఆడుతోంది 100వ టెస్ట్.. ప్రశ్నార్థకంగా భవిష్యత్తు.. ఓవైపు ఉక్కపోతగా మెల్‌బోర్న్ మైదానం.. మరోవైపు కాళ్లకు తిమ్మిర్లు.. కానీ ఇవన్నీ ధాటుకొని ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ దుమ్మురేపాడు. చీకటి కడుపును చీల్చుకుంటూ డబుల్ సెంచరీతో మళ్లీ ఆటగాడిగా ఉదయించాడు. తన పనైపోయిందని విమర్శించిన వారికి బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు.

వార్నర్ డబుల్.. సఫారీ ట్రబుల్!

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో డేవిడ్ వార్నర్(254 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 200 రిటైర్ట్ హర్ట్) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 91 ఓవర్లలో 3 వికెట్లకు 386 పరుగులు చేసింది. 45/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. వార్నర్‌కు తోడుగా స్టీవ్ స్మిత్(85) రాణించాడు. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్(48 బ్యాటింగ్), అలెక్స్ క్యారీ(9 బ్యాటింగ్) ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 197 పరుగులకు చేరింది. సౌతాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోర్జ్, రబడా తలో వికెట్ తీసారు. డేవిడ్ వార్నర్‌తో పాటు కామెరూన్ గ్రీన్(6) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు.

వార్నర్ రికార్డుల జోరు.

వార్నర్ రికార్డుల జోరు.

డబుల్ సెంచరీతో డేవిడ్ వార్నర్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 100వ టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా.. తొలి ఆస్ట్రేలియా ఆటగాడిగా చరిత్రకెక్కాడు. టెస్ట్‌ల్లో 8వేల పరుగుల మైలు రాయిని కూడా ధాటాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడుఫార్మాట్లలో కలిపి 17వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. టెస్ట్‌ల్లో 25వ శతకాన్ని అందుకున్న డేవిడ్ వార్నర్.. మూడో డబుల్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా చతేశ్వర్ పుజారా రికార్డును సమం చేశాడు. 100వ వన్డే, టెస్ట్‌ల్లో సెంచరీ బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా తరఫున ఏడో అత్యధిక స్కోర్ నమోదు చేశాడు.

సచిన్ రికార్డు సమం..

సచిన్ రికార్డు సమం..

అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు బాదిన భారత దిగ్గజ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ రికార్డును డేవిడ్ వార్నర్ సమం చేశాడు. సచిన్ వన్డే ఫార్మాట్‌లోనే ఓపెనర్‌గా 45 సెంచరీలు బాదగా..వార్నర్ మూడు ఫార్మాట్లలో కలిపి 45 సెంచరీలతో ఈ రికార్డును సమం చేశాడు. 100వ టెస్ట్‌లో డబుల్ సెంచరీ చేసిన జోరూట్ తర్వాత.. వార్నర్ ఈ ఘనతను అందుకున్నాడు. క్రాంప్స్ రావడంతో వార్నర్ రిటైర్ట్ హర్ట్‌గా మైదానం వీడాడు. లేకుంటే ట్రిపుల్ సెంచరీ కూడా బాదేవాడు. ఆ రితీలో అతని బ్యాటింగ్ కొనసాగింది.

Story first published: Tuesday, December 27, 2022, 13:17 [IST]
Other articles published on Dec 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+