For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్‌సీబీ‌పై కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ ఆధిపత్యం.. కోహ్లీసేనపై 8వ హాఫ్ సెంచరీ!

David Warner domination on RCB continues 8th IPL 50 by SRH Captian

చెన్నై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఆర్‌సీబీ అంటేనే పూనకంతో ఊగిపోయే డేవిడ్ భాయ్.. మరోసారి ఆజట్టుపై చెలరేగాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సూపర్ బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ సాధించి ఫామ్ అందుకున్నాడు. కానీ జట్టుకు విజయాన్నందించలేకపోయాడు. కీలక సమయంలో డేవిడ్ వార్నర్ ఔటవ్వడం.. సన్‌రైజర్స్ విజయవకాశాలను దెబ్బతీసింది.

బ్యాటింగ్‌కు ప్రతికూలమైన పిచ్‌పై చెలరేగిన వార్నర్.. చూడ చక్కని షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో డానియల్ క్రిస్టియన్ వేసిన 12 ఓవర్ తొలి బంతికి క్విక్ డబుల్ తీసి 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది ఆర్‌సీబీపై డేవిడ్ వార్నర్‌కు 8వ హాఫ్ సెంచరీకాగా.. ఈ సీజన్‌లో ఇదే ఫస్ట్ ఫిఫ్టీ. ఇక కైల్ జేమీసన్ వేసిన మరుసటి ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన డేవిడ్ వార్నర్ క్రిస్టియాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఈ వికెట్‌తో ఆర్‌సీబీ పతనం మొదలైంది. షబాజ్ అహ్మద్ వేసిన 17 ఓవర్‌లో జానీ బెయిర్ స్టో(12), మనీశ్ పాండే(38) వరుస బంతుల్లో ఔటవ్వగా.. చివరి బంతికి ఫించ్ హిట్టర్ అబ్దుల్ సమద్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. చివర్లో రషీద్ ఖాన్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా కుదరలేదు. దాంతో ఆర్‌సీబీ విజయం లాంచనమైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 రన్స్ చేసింది. గ్లేన్ మ్యాక్స్ వెల్(41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59), విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 4 ఫోర్లతో 33) మినహా అంతా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్ మూడు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ రెండు, షబాజ్ నదీమ్, నటరాజన్, భువీ తలో వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 రన్స్‌కే పరిమితమైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(37 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 54), మనీశ్ పాండే(39 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) రాణించినా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.

Story first published: Wednesday, April 14, 2021, 23:38 [IST]
Other articles published on Apr 14, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+