మేం ఓడినా.. నటరాజన్ రాణించడం సంతోషాన్నిచ్చింది: డేవిడ్ వార్నర్

సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై సంచలన ప్రదర్శనతో యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన యువ పేసర్ నటరాజన్‌పై అతని ఐపీఎల్ సారథి, ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల జల్లు కురిపించాడు. నెట్ బౌలర్‌గా వచ్చి భారత స్టార్ పేసర్‌గా ఎదగడం అద్భుతమని కొనియాడాడు. తమ జట్టు టీ20 సిరీస్ ఓడినా.. నటరాజన్ రాణించడం చాలా సంతోషాన్నిచ్చిందన్నాడు. ఇక ఈ సీజన్ ఐపీఎల్‌లో నటరాజన్ ప్రతిభ గుర్తించిన వార్నర్ అతనికి అవకాశాలిస్తూ ప్రోత్సహించాడు. ఒక రకంగా నటరాజన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టడానికి కారణమయ్యాడు. దాంతోనే అతను తెగ ఆనందపడుతున్నాడు.
వారెవ్వా నట్టూ..
చివరి టీ20 అనంతరం ఈ ఆనందాన్ని వార్నర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఐపీఎల్లో నా సహచర ఆటగాడైన నటరాజన్.. భారత్-ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అదరగొట్టాడు. నెట్ బౌలర్‌గా ఈ పర్యటనకు ఎంపికై తర్వాత భారత్ తరఫున అరంగేట్రం చేయడం గొప్ప ఘనత. క్రికెట్‌లో గెలుపోటములు పక్కనపెడితే భారత్-ఆస్ట్రేలియా ఆటగాళ్లు పరస్పరం గౌరవించుకుంటారు. మేం టీ20 సిరీస్ కోల్పోయినా నటరాజన్ ప్రదర్శన పట్ల ఎక్కువ సంతోషంగా ఉన్నా. నటరాజన్ మంచి ఆటగాడు. అతని వల్లే ఈ సిరీస్‌ను ఆస్వాదించా.'అని వార్నర్ పేర్కొన్నాడు.

అనూహ్య అవకాశం..
ఆస్ట్రేలియా పర్యటనకు తొలుత నెట్ బౌలర్‌గా ఎంపికైన నటరాజన్.. వరుణ్ చక్రవర్తి గాయపడటంతో టీ20 జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత నవ్‌దీప్ సైనీ వెన్నుగాయంతో అతనికి బ్యాకప్ బౌలర్‌గా వన్డే టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. అంతేకాకుండా తొలి రెండు వన్డేల్లో భారత పేసర్లంతా విఫలమవడంతో
ఆఖరి మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్నాడు. ఇక అరంగేట్రంలోనే అదరగొట్టాడు. తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి 2-0తో సిరీస్ కోల్పోయిన జట్టుకు ఉపశమన విజయాన్నందించాడు. ఈ సూపర్ ఫెర్ఫామెన్స్‌తో టీ20ల్లోకి కూడా అరంగేట్రం చేసి మరో బుమ్రాలా చెలరేగాడు.

బుమ్రా లోటును..
తొలి టీ20లో 4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసిన నట్టూ.. రెండో టీ20లో భారత బౌలర్లంతా విఫలమైన వేళ పొదుపైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. ఇక ఆఖరి టీ20లోనూ తనదైన బౌలింగ్‌తో మెరిసాడు.జోరు మీదున్న గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను ఔట్ చేసి భారీ స్కోర్‌కు అడ్డుకట్ట వేశాడు. మాథ్యూ వేడ్‌ను ఔట్ చేసినప్పటికీ అంపైర్ల తప్పిదంతో అది ఖాతాలోకి రాలేదు. ఇక నట్టూ సూపర్ పెర్ఫామెన్స్‌తో జట్టులో బుమ్రా లేని లోటు కనిపించలేదు.
ఐపీఎల్‌కు వచ్చింది తాగి తందాన చేయడానికే.. మ్యాక్స్‌వెల్‌పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications