Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యంత్రంలా పరుగులు చేసేందుకు కోహ్లీ ఏం రోబో కాదు: డేవిడ్ వార్నర్

David Warner defends Virat Kohli over lack of runs in recent times

న్యూఢిల్లీ: గత రెండేళ్లుగా నిలకడలేమి ఫామ్‌తో సతమవుతున్న టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అండగా నిలిచాడు. విరాట్‌ కోహ్లీ లాంటి అత్యుత్తమ బ్యాటర్ విఫలమైనా పర్వాలేదని ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. యంత్రంలా పరుగులు చేసేందుకు కోహ్లీ ఏం రోబో కాదని, అతను ఓ మనిషేనని చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్‌ పరంగా కోహ్లీ ప్రస్తుతం గడ్డు పరిస్థితలను ఎదుర్కొంటున్నప్పటికీ, అతను కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని అన్నాడు. తన బ్యాటింగ్‌ నైపుణ్యంతో విరాట్ కోహ్లీ ఎన్నో వ్యక్తిగత రికార్డులతో పాటు టీమిండియాకు చిరస్మరణీయ విజయాలు అందించాడని గుర్తు చేశాడు.

ఫామ్ కోల్పోవడం సహజమే..

ఫామ్ కోల్పోవడం సహజమే..

ఇండియా టుడే 'బ్యాక్‌ స్టేజ్‌ విత్‌ బోరియా' కార్యాక్రమంలో మాట్లాడిన వార్నర్‌ కోహ్లీ బ్యాటింగ్ వైఫల్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘కోహ్లీ లాంటి ఆటగాడు విఫలమైనా పర్వాలేదు. ఎన్నో ఏళ్ల నుంచి అత్యుత్తమ ఆట ఆడుతున్న ఆటగాడు ఇప్పుడు విఫలమవ్వడం అర్థం చేసుకోదగిన విషయమే. అందుకు అతను పూర్తి అర్హత కలిగినవాడు. స్టీవ్‌ స్మిత్‌ కూడా గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సెంచరీ చేయలేదు. కానీ, అతను ప్రతీ నాలుగు ఇన్నింగ్స్‌లకు ఒక సెంచరీ బాదుతాడని గణాంకాలు చెబుతున్నాయి. కొన్నిసార్లు కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని అర్థం చేసుకోవచ్చు. అందుకే వారిపై అధిక ఒత్తిడి ఉంటుందని అనుకుంటున్నా."అని వార్నర్ చెప్పుకొచ్చాడు.

కుర్రాళ్లకు ఏం మెసేజ్ ఇచ్చినట్లు..

కుర్రాళ్లకు ఏం మెసేజ్ ఇచ్చినట్లు..

ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లో తనను అర్థంతరంగా టీమ్ కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు తుది జట్టు నుంచి తప్పించడం ద్వారా యువ ఆటగాళ్లకు ఏం సందేశమిచ్చారని, అదే తనను బాధపెట్టిందని వార్నర్ చెప్పుకొచ్చాడు. ‘కెప్టెన్సీ నుంచి తొలగించడం... కనీసం తుది జట్టులో చోటు కల్పించకపోవడం... జట్టులోని యువ ఆటగాళ్లపై ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇలా చేయడం ద్వారా వారికి మీరు ఏం సందేశం ఇస్తున్నారు. నన్ను తీవ్రంగా బాధించిన విషయం ఏదైనా ఉందంటే... జట్టులోని యువ క్రికెటర్ల గురించే. ‘‘మాకు కూడా ఏదో ఒక రోజు ఇలా జరుగుతుంది'' అనే అభద్రతా భావాన్ని పెంచుకునే అవకాశం ఉంది'' అని వార్నర్‌ చెప్పుకొచ్చాడు.

ఆర్‌సీబీ కెప్టెన్‌గా..

ఆర్‌సీబీ కెప్టెన్‌గా..

టీమ్‌మేనేజ్‌మెంట్‌తో వచ్చిన బేదాభిప్రాయల నేపథ్యంలో వార్నర్‌పై సన్‌రైజర్స్ వేటు వేసింది. ఇప్పటికే ఈ విషయంపై అనేకసార్లు వార్నర్ మాట్లాడాడు. ‘జరిగిందేదో జరిగిపోయింది. పక్కన పెట్టినంత మాత్రాన ఎవరినీ విమర్శించే తత్వం కాదు నాది. ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. బాధ పడుతూ కూర్చోకుండా.. వాస్తవాన్ని అర్థం చేసుకుని.. అసలు నన్ను ఎందుకు తప్పించారోనన్న విషయం గురించే ఆలోచిస్తాను'' అంటూ స్ఫూర్తిదాయకంగా మాట్లాడాడు. కాగా మెగా వేలం-2022లో భాగంగా వార్నర్‌కు భారీ ధర లభించే అవకాశం ఉంది. రాయల్స్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు జట్టుకు అతడు కెప్టెన్‌ అవుతాడని, ఇప్పటికే టీమ్‌మేనేజ్‌మెంట్ అతనితో లోపకాయిరి ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. తాజా విరాట్, వార్నర్ మధ్య ఉన్న బంధం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది. కోహ్లీని వెనుకేసుకురావడం కూడా ఆర్‌సీబీలోకి వెళ్లే సంకేతమేనని ఫ్యాన్స్ అంటున్నారు.

IPL 2022 : David Warner As RCB Captain ? | Oneindia Telugu
కోహ్లీ చెలరేగెనా..

కోహ్లీ చెలరేగెనా..

ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ ఫస్ట్ టెస్ట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. రెండు ఇన్నింగ్స్‌ల్లో ఒకే తరహాలో ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌ను వెంటాడి పెవిలియన్ చేరాడు. ఇక వెన్ను నొప్పితో రెండో టెస్ట్‌కు దూరమైన కోహ్లీ.. కేప్‌టౌన్ వేదికగా మూడో టెస్ట్ ఆడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ బరిలోకి దిగితే మెరుగ్గా రాణించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Story first published: Saturday, January 8, 2022, 17:59 [IST]
Other articles published on Jan 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+