Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

David Warner: ‘డేవిడ్ రాజ్.. నీ అవ్వ తగ్గేదేలే’.. మరోసారి ‘పుష్ప’తో వచ్చిన సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్! (వీడియో

 David Warner Dancing For Allu Arjun Pushpa Ey Bidda Idi Naa Adda Video Song Goes Viral

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి 'పుష్ప రాజ్'అవతారమెత్తాడు. అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్‌కు ముందే ఫేస్ యాప్ టెక్నాలజీ సాయంతో పుష్ప సినిమాలోని 'యే బిడ్డా.. ఇది నా అడ్డా'అనే పాటను ఇమిటేట్ చేసిన వార్నర్ బాయ్.. తాజాగా ఆ సాంగ్‌లో తనకు నచ్చిన బిట్‌ను షేర్ చేశాడు. దానికి 'నా ఫేవరెట్'అని క్యాప్షన్ ఇచ్చి.. తన డ్యాన్స్‌కు క్యాప్షన్ ఇవ్వాలని అభిమానులను కోరాడు. ఇక డేవిడ్ భాయ్‌ను పుష్ప రాజ్ అవతారంలో చూసిన అభిమానులు అతనిపై తమకున్న అభిమానాన్ని కామెంట్ల రూపంలో చూపించారు. 'డేవిడ్ రాజ్.. నీ అవ్వ తగ్గేదేలే', 'ఏ బిడ్డా ఇది వార్నర్ అడ్డా'అని క్యాప్షన్‌లు ఇచ్చారు.

హీరోగా సత్తా చాటే..

హీరోగా సత్తా చాటే..

కొందరు అయితే ఈ వీడియోపై విరాట్ కోహ్లీ కామెంట్ కోసం ఎదురు చూస్తున్నామని కామెంట్ చేయగా.. అతను సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో బిజీగా ఉన్నాడని వార్నర్ బదులిచ్చాడు. ఇంకొందేరేమో బాలీవుడ్, టాలీవుడ్.. వార్నర్ కోసం ఎదురు చూస్తుందని, భారత్‌కు వచ్చి సినిమాల్లో నటించాలని కోరుతున్నారు. అటు క్రికెట్.. ఇటు సినిమాల్లో సత్తా చాటే సామర్థ్యం డేవిడ్ భాయ్‌కి ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమా పాటలకు చిందేసిన వార్నర్ భాయ్.. మరెన్నో డైలాగ్స్‌కు లిపి సింక్ ఇచ్చాడు.

కోహ్లీ సైతం..

కోహ్లీ సైతం..

ఈ క్రమంలోనే పుష్ప సినిమాలోని 'యే బిడ్డా.. ఇది నా అడ్డా'అనే పాటను కూడా వార్నర్ ఇమిటేట్ చేశాడు. అప్పుడే ఈ వీడియోను చూసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వార్నర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. బ్రో.. నీవు బాగానే ఉన్నావ్! కదా అని ఫన్నీగా కామెంట్ చేశాడు. దీనికి వార్నర్ సైతం తనదైన శైలిలో బదులిచ్చాడు. 'నువ్వు నా తల గురించే అడుగుతున్నావని తెలుసు.. కొంచెం గొంతు పట్టేసిందంతే' అని రిప్లే ఇచ్చాడు. ఇక సన్‌రైజర్స్ అభిమానులు అయితే ఈ వీడియోను చూసి తెగ సంతోషపడ్డారు. కామెంట్లతో ముంచెత్తుతున్నారు. 'కోకో కోలా పెప్సీ.. డేవిడ్ భాయ్ సెక్సీ.. వార్నర్ అంటే ఫైర్.. ఫ్లవర్ అనుకుంటివా.. 'నీ అవ్వ తగ్గేదేలే.. డేవిడ్ పుష్ప.. వార్నర్ భాయ్.. మీరు త్వరగా రిటైర్ అయి.. తెలుగు సినిమాల్లో నటించండి'అంటూ అప్పట్లోనే మెచ్చుకున్నారు.

హైదరాబాద్‌తో ముగిసిన బంధం..

హైదరాబాద్‌తో ముగిసిన బంధం..

ఇక గతంలో కూడా వార్నర్.. అల్లు అర్జున్ పాటకు చిందేశాడు. అలవైకుంఠపురంలోని బుట్ట బొమ్మ పాటకు సతీమణి క్యాండీస్ వార్నర్‌తో కలిసి చిందేసాడు. అప్పట్లో ఈ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. ఎంతలా అంటే ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌ తమన్‌తో పాటు హీరో అల్లు అర్జున్ స్పందించేంత పాపులర్ అయింది. తెలుగు ప్రేక్షకులకు ఇంత దగ్గరైన వార్నర్.. వచ్చే సీజన్ నుంచి హైదరాబాద్‌కు ఆడడంటే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌తో వచ్చిన విభేదాల కారణంగా వార్నర్‌ తెలుగు ప్రేక్షకులకు దూరం కానున్నాడు. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో సన్‌రైజర్స్ వార్నర్‌ను రిటైన్ చేసుకోలేదు. కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను తీసుకుంది.

దుమ్మురేపుతున్న డేవిడ్ భాయ్..

దుమ్మురేపుతున్న డేవిడ్ భాయ్..

ఇక టీ20 ప్రపంచకప్‌లో ఫామ్ అందుకున్న డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియాకు టైటిల్‌కు అందించడంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. అదే ఫామ్‌ను ప్రస్తుత యాషెస్ సిరీస్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఫస్ట్ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 94 రన్స్ చేసిన వార్నర్.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక రెండో టెస్ట్‌లోనూ 90 ప్లస్ రన్స్ చేసిన వార్నర్.. మరోసారి శతకం చేజార్చుకోగా ఈ మ్యాచ్‌లో ఆసీస్ 275 రన్స్‌తో గెలుపొందింది. తాజాగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో వార్నర్ 38 పరుగులు చేయగా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది.

Story first published: Monday, December 27, 2021, 17:52 [IST]
Other articles published on Dec 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+