Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ సారి ముక్కాల ముక్కాబులా సాంగ్‌తో అదరగొట్టిన డేవిడ్ వార్నర్

David Warner dances with wife on famous Prabhudeva song Muqabala Muqabala

సిడ్నీ: కరోనా కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నిరవదికంగా వాయిదా పడినా.. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ జోరు మాత్రం ఆగడం లేదు. మైదానంలో తన పవర్ హిట్టింగ్ బ్యాటింగ్‌తో అలరించే ఈ సన్‌రైజర్స్ ప్లేయర్.. ఈ క్వారంటైన్‌ సమయంలోనూ అదే తరహాలో తన అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.

వరుస టిక్‌టాక్ వీడియోలతో దూసుకుపోతున్నాడు. అది కూడా తెలుగు పాటలు.. డైలాగ్‌లను ఇమిటేట్ చేస్తూ టాలీవుడ్ హీరోలకు సవాల్ విసురుతున్నాడు. వారి నుంచి ప్రశంసలు, సినిమా ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ టిక్‌టాక్ వీడియోల్లో వార్నర్‌తో పాటు అతని సతీమణి క్యాండిస్, కూతురు ఇవీమే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

ఇప్పటికే 'అల.. వైకుంఠపురములో'చిత్రంలో బుట్టబొమ్మ, రాములో రాములా పాటలకు ఫ్యామిలీతో చిందేసిన వార్నర్.. ఆ మూవీ హీరో అల్లు అర్జున్, సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్‌ల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. బన్నీ ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తాడు. అనంతరం సూపర్ స్టార్ మహేశ్ బాబు పోకిరి మూవీలోనే డైలాగ్ చెప్పి.. ఆ మూవీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నుంచి ప్రశంసలతో పాటు సినిమా ఆఫర్ అందుకున్నాడు. తద్వార మహేశ్ బాబు ఫ్యాన్స్‌ను అలరించాడు.

నిన్న ఆల్‌టైల్ సూపర్ హిట్ బాహుబలి చిత్రంలోని డైలాగ్ చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌ను కవర్ చేశాడు. తాజాగా ప్రేమికుడు సినిమాలోని ముక్కాల ముక్కాబుల పాటకు టిక్‌టాక్ చేశాడు. తన భార్య క్యాండిస్‌తో కలిసి ప్రభూదేవా స్టైల్లో స్టెప్పులేశాడు. మధ్యలో కూతురు ఇవీ కూడా ప్రదాన ఆకర్షణగా నిలిచి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ టిక్‌టాక్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను వార్నరే 'ఎవరు బాగా చేసారు.. మేమా? లేక శిల్పాశెట్టా? లేక ఒరిజనల్ ప్రభూదేవానా?'అని ఫ్యాన్స్‌ను ప్రశ్నించాడు. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కూడా తన అధికారిక ట్విటర్‌లో ఈ వీడియోను షేర్‌ చేసింది.

Story first published: Sunday, May 17, 2020, 18:36 [IST]
Other articles published on May 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+