Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మొన్న బుట్ట బొమ్మకు చిందేసిన వార్నర్.. నేడు సన్నజాజితో ఇరగదీసాడు!

David Warner, Candice and Indi Rae shake leg on popular Tamil song in latest Tik Tok video
#Watch : David Warner Dances To Kamal Haasan’s Tamil Song

సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ టిక్‌టాక్‌లో దుమ్ములేపుతున్నాడు. అచ్చం తన బ్యాటింగ్ మాదిరే ఇరగదీస్తున్నాడు. కూతురి కోరిక మేరకు టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టిన ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్.. దాని గురించి ఏం తెలియదంటూనే వరుస వీడియోలతో కుమ్మేస్తున్నాడు. ఫ్యాన్స్‌కు కావాల్సిన మజాను అందిస్తున్నాడు.

మొన్న తెలుగు సూపర్ హిట్ 'బుట్ట బొమ్మ’ పాటకు చిందేసి ఆ సాంగ్ హీరో అల్లు అర్జున్‌తో ప్రశంసలు అందుకున్న ఈ ఆసీస్ స్టార్.. తాజాగా తమిళ సాంగ్‌ 'సన్నజాజికి’ డ్యాన్స్‌ చేశాడు. బుట్ట బొమ్మ తరహాలోనే తన భార్య క్యాండీస్‌తో కలిసి ఈ తమిళసాంగ్‌కు టిక్‌టాక్‌ చేశాడు. ముందు వరుసలో కూతురు ఇండిరే ఉండగా, వెనకాల వార్నర్‌-కాండీస్‌ జంటగా స్టెప్పులేశారు. అచ్చం తమిళ్ స్టైల్లోనే వార్నర్ ప్యాంట్‌పై నుంచి లుంగీ కట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

దీంతో అతని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఆనందానికి అడ్డే లేకుండా పోయింది. ప్రధానంగా సౌత్‌ ఇండియా సినిమాల్లోని పాటలకు వార్నర్‌ టిక్‌టాక్‌ వీడియోలు చేయడం వారికి మరింత ఆనందాన్నిస్తుంది. ఈ తరహాలోనే ఇంకొన్ని వీడియోలు చేయాలంటూ వార్నర్‌ను కోరుతున్నారు.

అలవైకుంఠపురంలోని బుట్టబొమ్మా సాంగ్ గురించి వరల్డ్ బెస్ట్ ఓపెనర్ రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ముచ్చటించుకున్నారు . ఈ సందర్భంగా 'నీ బుట్ట బొమ్మ సాంగ్ డాన్స్ అదిరిపోయింది వార్నర్... సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది'అని వార్నర్‌‌ను రోహిత్ శర్మ కొనియాడాడు. అది టాలీవుడ్ పాట కదా అని కూడా అడిగాడు. అయితే టాలీవుడ్, బాలీవుడ్ పాటలకు డాన్స్ చేయడం చాలా కష్టమని తెలిపిన వార్నర్.. హైదరాబాద్ అంటే తనకెంతో ఇష్టమని అక్కడి అభిమానులు ఎంతో చురుగ్గా ఉంటారని చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, May 9, 2020, 17:27 [IST]
Other articles published on May 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+