
అభిమాని మార్ఫింగ్:
అల వైకుంఠపురములో సినిమాలోని 'సితరాల సిరపడు' పాటలో టాలీవుడ్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక చేతిలో కోడి, మరో చేతిలో కత్తి పట్టుకుని విలన్ ఇంటికి వెళ్లే సీన్‌కు అరుపులు, విజిల్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అంతలా అతడి స్టైల్ అభిమానులను అలరించింది. ఫాన్స్ ఇప్పుడు ఆ సీన్‌లోకి డేవిడ్ వార్నర్‌ను తీసుకొచ్చారు. అల్లు అర్జున్ కోడిపుంజుతో ఉన్న ఫొటోను ఓ అభిమాని మార్ఫింగ్ చేశాడు. ఇక్కడ వార్నర్ ఓ చేతిలో కోడిపుంజు, మరో చేతిలో బ్యాట్ పట్టుకొస్తున్నట్లు మార్ఫింగ్ చేశారు. అచ్చం వార్నరే ఆ సీన్ చేసినట్టు చేశాడు.

అల దుబాయ్‌లో:
మార్ఫింగ్ ఫొటోను సదరు అభిమాని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. వార్నర్ భాయ్ మళ్లీ వస్తున్నాడు అని రాసుకొచ్చాడు. 'అల దుబాయ్‌లో' అని టైటిల్ పెట్టాడు. కాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటోకు డేవిడ్ వార్నర్ స్పందించాడు. పోస్ట్‌ను షేర్ చేసి నవ్వుతున్నట్టు ఎమోజీలను పోస్ట్ చేశాడు. ఇక నెటిజన్లు, ఫ్యాన్స్ ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. డేవిడ్ భాయ్ ఐపీఎల్ కోసం దుబాయ్ వచ్చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అల వైకుంఠపురములో' సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై హిట్ కొట్టింది. ఈ సినిమాలోని పలు పాటలకు వార్నర్ టిక్ టాక్ చేసాడు.

భార్య, కూతుళ్లతో కలిసి డ్యాన్స్‌లు:
కరోనా వైరస్ లాక్డౌన్ కాలంలో తన డ్యాన్స్‌లు, సరదా వీడియోలతో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా స్టార్ అయ్యాడు. తెలుగు, తమిళ్, హిందీ పాటలకు భార్య, కూతుళ్లతో కలిసి డ్యాన్స్‌లు చేసి భారత అభిమానులను ఎలా మురిపించాడో అందరికీ తెలిసిందే. టిక్‌టాక్‌లో సతీమణి క్యాండిస్ వార్నర్‌తో కలిసి బుట్టబొమ్మ, రాములో రాములా, బ్యాంగ్‌బ్యాంగ్ వంటి పాటలకు వార్నర్ స్టెప్పులేశాడు. భారత్‌లో టిక్‌టాక్‌ను నిషేధించిప్పటికీ.. వార్నర్ ఇతర సోషల్‌మీడియా వేదికల ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉన్నాడు.

మరోసారి కెప్టెన్‌గా:
డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016 ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే 2018లో బాల్ ట్యాంపరింగ్ వివాదంతో నిషేధానికి గురయ్యాక.. వార్నర్ సన్‌రైజర్స్ కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. దీంతో న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ జట్టును నడిపించాడు. గతేడాది మళ్లీ వార్నర్ ఐపీఎల్లో పునరాగమనం చేసి 697 పరుగులతో అదరగొట్టాడు. అయితే ఈ ఏడాది సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం వార్నర్‌ను మరోసారి కెప్టెన్‌గా నియమించింది. సన్‌రైజర్స్ జట్టుకు మళ్లీ సారథిగా ఎంపికవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని, కెప్టెన్సీని తిరిగి పొందాననుకోవట్లేదని వార్నర్ అన్నాడు. ఈ సీజన్లో జట్టుకు మరో టైటిల్‌ను అందించడమే లక్ష్యంగా ముందుకుసాగుతామన్నాడు.
'ఫ్రైడే నైట్‌ని ఎంజాయ్ చేయాలి.. ద్రవిడ్‌ను ఔటివ్వండి అంపైర్'


Click it and Unblock the Notifications
