Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుట్ట బొమ్మ సాంగ్‌లో అదరగొట్టిన డేవిడ్ వార్నర్ దంపతులు.!

David Warner and wife Candice dance on Telugu hit Butta Bomma Song

సిడ్నీ: కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే టిక్‌టాక్‌లో అడుగుపెట్టిన ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ రోజుకో వీడియోతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే తన పిల్లలు, సతీమణితో కలిసి చేసిన కొన్ని టిక్‌టాక్ వీడియోలను షేర్ చేసిన ఈ హైదరాబాద్ ప్లేయర్.. తాజాగా తెలుగు హిట్‌సాంగ్‌ 'బుట్ట బొమ్మ'సాంగ్‌కు తన సతీమణి క్యాండిస్‌తో కలిసి చిందేశాడు.

సన్‌రైజర్స్ జెర్సీలో..

సన్‌రైజర్స్ జెర్సీలో..

ఈ సాంగ్‌కు సతీమణితో కలిసిన డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో వార్నర్ సన్ రైజర్స్ జెర్సీ వేసుకోగా.. కుమార్తె ఇండి వెనకాల తిరుగుతూ తనకు తోచిన స్టెప్పులు వేసింది. ఇందుకు సంబంధించిన టిక్‌టాక్ వీడియోను వార్నర్‌ దంపతులు వారి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లలో షేర్ చేశారు. ఈ పోస్ట్‌కు క్యాండీస్ ‘ఇండి మొత్తం షోను దొంగిలించిందని'అని క్యాప్షన్‌గా పేర్కొనగా.. వార్నర్ మాత్రం ఇది టిక్ టాక్ సమయమని క్యాప్షన్‌గా రాసుకొచ్చాడు.

నెట్టింట హల్‌చల్..

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఐపీఎల్‌‌తో హైదరాబాద్‌కు చాలా దగ్గరైన వార్నర్ .. తెలుగు వాతావరణానికి బాగా అలవాటు పడ్డాడు. అందులో భాగంగానే తెలుగు అభిమానుల అలరించడం కోసం బుట్టబొమ్మ సాంగ్‌కు చిందేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు బుట్టబొమ్మ సాంగ్‌ కూడా ఇటీవల కాలంలో బాగా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. చాలా మంది ఈ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అల్లు అర్జున్ మూవీ..

అల్లు అర్జున్ మూవీ..

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో'‌లోని ఈ బుట్టబొమ్మ సాంగ్ హెద్ద హిట్ అయింది. సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఈ సినిమా.. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్‌లో తమన్ సమకూర్చిన సంగీతం కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ చిత్రంలోని పాటలు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ముఖ్యంగా సామజవరగమన, బుట్ట బొమ్మ వంటి సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి.

లేడీస్ స్విమ్ సూట్​లో​ వార్నర్..

లేడీస్ స్విమ్ సూట్​లో​ వార్నర్..

మైదానంలో నిత్యం బౌండ‌రీల‌తో హోరెత్తించే డేవిడ్ వార్న‌ర్‌ ఇప్పుడు టిక్‌టాక్ వీడియోల‌తో అభిమానులను థ్రిల్ చేస్తున్నాడు. ఈ విషయంలో ఎక్కడా కూడా తగ్గే ప్రసక్తే లేదన్నట్లు వార్నర్‌ తనకు నచ్చింది చేస్తున్నాడు.

ఇటీవ‌లే త‌న భార్య క్యాండిస్‌తో క‌లిసి చేసిన ఓ వీడియో.. వార్నర్‌లోని కొత్త కోణాన్ని చూపెట్టింది. ఇక్కడ క్యాండిస్, వార్నర్ తమ తమ రోల్స్‌ను మార్చుకుని మరీ టిక్‌టాక్‌ వీడియో చేయడం నవ్వులు పూయించింది.

ఈ వీడియోలో వార్న‌ర్ త‌న కాస్ట్యూమ్‌లో తొలుత ఆసీస్ జ‌ట్టు జెర్సీ వేసుకుని ఉన్నాడు. అత‌ని వెనుక క్యాండిస్‌.. స‌ర్ఫింగ్ కాస్ట్యూమ్‌లో బోటు న‌డుపుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఓ లైట్ మ్యూజిక్‌తో వీడియో సాగుతుంది. అయితే అక‌స్మాత్తుగా ఆ వీడియోలో ఇద్ద‌రి ప్లేస్ మారుతుంది. వార్న‌ర్ డ్రెస్సులో క్యాండిస్‌.. భార్య స‌ర్ఫింగ్ కాస్ట్యూమ్‌లోకి డేవిడ్ మారుతాడు. బోటులో షికారుకు వెళుతున్నట్లు వార్న‌ర్ పోజులిస్తాడు. ఇద్దరూ తమ పాత్రలను ఎక్సేంజ్‌ చేసుకుని అభిమానులకు వినోదాన్ని అందించారు.

Story first published: Thursday, April 30, 2020, 15:54 [IST]
Other articles published on Apr 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+