హమ్మయ్యా.. ఆ బాధ తీరింది: డేవిడ్ మిల్లర్
గత కొన్ని రోజులుగా తనను వెంటాడుతున్న బాధ తీరిందని ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ అన్నాడు. గుజరాత్ టైటాన్స్ చేతిలో తమ జట్టు ఓటమికి కారణమయ్యాననే బాధ తనను కలిచి వేసిందని తెలిపాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించినందుకు సంతోషంగా ఉందని, తనకు ఇప్పుడు ప్రశాంతంగా ఉందని చెప్పాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆర్‌సీబీతో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. డేవిడ్ మిల్లర్(10 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 22 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో ఢిల్లీకి చిరస్మరణీయమైన విజయాన్నందించాడు.
చాలా ప్రశాంతంగా ఉంది..
ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో వరుసగా 6,6,4 బాది మరో బంతి మిగిలి ఉండగానే మిల్లర్ మ్యాచ్‌ను ముగించాడు. అయితే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఇలాంటి పరిస్థితుల్లోనే డేవిడ్ మిల్లర్ ఆఖరి 2 బంతులకు పరుగులు చేయలేక కుల్దీప్ యాదవ్‌తో సింగిల్‌కు నిరాకరించి ఓటమికి కారణమయ్యాడు. తాజా విజయంతో ఆ తప్పిదానికి మిల్లర్ బదులు తీర్చుకున్నాడు.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన డేవిడ్ మిల్లర్ సంతోషంగా ఉందని, తనను వెంటాడుతున్న బాధ తీరిందని చెప్పుకొచ్చాడు. 'చాలా సంతోషంగా ఉంది. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేయలేకపోయాననే బాధ నన్ను వెంటాడింది. కానీ మళ్ళీ అలాంటి స్థితిలోనే ఉండి మ్యాచ్ గెలిపించడం చాలా సంతోషంగా ఉంది. మరో మ్యాచ్ గెలిచే వరకు పాత ఓటమి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. మాకు ఒక వారం విరామం లభించింది. ఈ సమయంలో నేను కొన్ని విషయాలను సరిచేసుకున్నాను. ఎక్కువగా ఆలోచిచకుండా ప్రస్తుత క్షణంపై ఫోకస్ పెట్టి నా శక్తిమేర ప్రయత్నించాను.
యార్కర్లు కావడంతో ఆడలేకపోయా..
నేను ఎదుర్కొన్న తొలి 6 బంతులు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. అవి ఆరు యార్కర్లు కావడంతో నేను పరుగులు తీయలేకపోయాను. కానీ చివరి 6 బంతుల్లో అది సాధ్యమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మేం రెండో చివరి ఓవర్లోనే మ్యాచ్ ముగించాలని ప్రయత్నించాం. చివరి నాలుగు ఓవర్లలో 43 పరుగులు కావాల్సినప్పుడు ఒకటి రెండు సిక్సర్లు వస్తాయని తెలుసు. వరుసగా బౌండరీలు బాదితే ఏ బౌలర్ అయినా ఒత్తిడిలోకి వెళ్తాడు. అందుకే డాట్ బాల్స్ తగ్గించి, బౌండరీ బాల్ వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించాం.
అతని సలహాతోనే..
ప్రశాంతంగా ఉంటూ మ్యాచ్‌ను వీలైనంత చివరి వరకు తీసుకెళ్లాలనుకున్నాం. నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు చాలా బ్రేక్స్ వచ్చాయి. దాంతో లయ దెబ్బతినట్లు అనిపించింది. కానీ నేను క్రీజులోకి వెళ్లగానే 'నీ ఇంటెన్సిటీని అలాగే కొనసాగించు' అని స్టబ్స్ చెప్పాడు. ఆ మాట నన్ను మంచి మానసిక స్థితిలోకి తీసుకెళ్లి దూకుడుగా ఆడేలా సహాయపడింది.
స్టబ్స్‌తో కలిసి మ్యాచ్‌లు ముగించడం ఎప్పుడూ బాగుంటుంది. మేం ఇద్దరం కలిసి చాలాసార్లు బ్యాటింగ్ చేశాం. అతను నాతో 'నన్ను కాపాడావు, చాలా థాంక్స్' అన్నాడు. కానీ తను అద్భుతంగా ఆడాడని నేను భావిస్తున్నాను. ఇన్నింగ్స్ మొత్తం తనే నిలబెట్టాడు. అతను చాలా ప్రశాంతంగా ఉంటాడు. మంచి టెక్నిక్, పవర్ కలిగిన ఆటగాడు. తను క్రీజులో ఉండటం మాకు చాలా కీలకం.'అని డేవిడ్ మిల్లర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications