For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: గుజరాత్ టైటాన్స్‌కు ఎదురు దెబ్బ.. ఆ కిల్లర్ ప్లేయర్ దూరం!

IPL 2023: David Miller confirms South Africa stars to miss opening round of IPL 16 for Netherlands ODI

న్యూఢిల్లీ: ఐపీఎల్‌-2023 సీజన్‌ ప్రారంభానికి ముందే డిఫెండింగ్‌ చాంపియన్ గుజరాత్‌ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్, సౌతాఫ్రికా ప్లేయర్ డేవిడ్‌ మిల్లర్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. సౌతాఫ్రికా జట్టు తరఫున వన్డే సిరీస్ ఆడాల్సి ఉండటంతో గుజరాత్ టైటాన్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడలేకపోతున్నానని స్పష్టం చేశాడు.

వన్డే వరల్డ్‌ కప్ సూపర్ లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగే వన్డే సిరీస్‌కు డేవిడ్ మిల్లర్‌తో సౌతాఫ్రికా స్టార్ ఆటగాళ్లంతా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. మార్చి 31న ఐపీఎల్‌-2023 మొదలవ్వనుండగా.. అదే రోజు నెదర్లాండ్స్‌తో సౌతాఫ్రికా తొలి వన్డే ఆడనుంది. ఏప్రిల్‌ 2న రెండో వన్డే జరగనుంది. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్‌కు సౌతాఫ్రికా నేరుగా అర్హత సాధించాలంటే ఈ రెండు వన్డేలు గెలవడం కీలకం. ఈ క్రమంలోనే క్రికెట్ సౌతాఫ్రికా స్టార్ ఆటగాళ్లందర్నీ అందుబాటులో ఉండాలని ఆదేశించింది.

IPL 2023: David Miller confirms South Africa stars to miss opening round of IPL 16 for Netherlands ODI

గతంలో మాదిరి సౌతాఫ్రికా జట్టా? ఐపీఎల్? అనే ఆప్షన్ ఇవ్వలేదు. దాంతో సౌతాఫ్రికా క్రికెటర్లంతా ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. డేవిడ్ మిల్లర్‌తో పాటు సఫారీ ఆటగాళ్లు ఎయిడెన్‌ మార్క్రమ్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌), మార్కో జన్సెన్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌), అన్రిచ్‌ నోర్జే, లుంగి ఎంగిడి (ఢిల్లీ క్యాపిటల్స్‌), ట్రిస్టన్‌ స్టబ్స్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌ (ముంబై ఇండియన్స్‌), క్వింటన్‌ డికాక్‌ (లక్నో), రబాడ (పంజాబ్‌) ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు.

గతేడాది కూడా సౌతాఫ్రికా క్రికెటర్లకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కానీ అప్పుడు కచ్చితంగా సౌతాఫ్రికాకు ఆడాలనే నిబంధనను క్రికెట్ సౌతాఫ్రికా పెట్టలేదు. దాంతో రబడా, ఎంగిడి, జాన్సెన్‌, మార్క్రమ్‌, డస్సెన్‌లు జాతీయ జట్టుకు కాకుండా ఐపీఎల్‌కు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి లీగ్‌లో ఆడారు. అప్పుడు సౌతాఫ్రికా.. బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఆడింది. ఐపీఎలా లేక జాతీయ జట్టా అన్న నిర్ణయాన్ని క్రికెట్‌ సౌతాఫ్రికా ఆటగాళ్లకే వదిలేయడంతో వారు అప్పట్లో ఐపీఎల్‌కే ఓటేశారు. కానీ ఈ సారి ఆ వెసులు బాటు ఇవ్వలేదని మిల్లర్ తెలిపాడు.

Story first published: Monday, March 20, 2023, 22:40 [IST]
Other articles published on Mar 20, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+