
గంగూలీకి వీరాభిమానిని:
సోనీ టెన్ పిట్ స్టాప్ ఫేస్‌బుక్ పేజీ లైవ్ ఇంటరాక్షన్‌లో డేవిడ్ లాయిడ్ మాట్లాడుతూ... 'సౌరవ్ గంగూలీకి నేను వీరాభిమానిని. అతడు జట్టులో ఆత్మవిశ్వాసం పెంపొందించాడు. జట్టులో ఫాస్ట్ బౌలర్లను ఎదిరించే ఆటగాళ్లను సిద్ధం చేశాడు. సాధారణంగా విదేశాల్లో టీమిండియాకు బౌన్సీ పిచ్‌లంటే ఇష్టం ఉండదు. కానీ దాదా మాత్రం బౌన్సర్లకు పూర్తిగా సిద్ధమయ్యే ఆస్ట్రేలియాకు వెళ్లాడు. భారత జట్టులో మార్పునకు గంగూలీ ఉత్ప్రేరకంగా పనిచేశాడు. అతడికి రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ అండగా నిలిచారు' అని తెలిపారు.

కోహ్లీ మరోస్థాయికి తీసుకెళ్లాడు:
'భారత క్రికెట్‌పై సౌరవ్ గంగూలీ చెరగని ముద్ర వేశాడు. ప్రపంచ స్థాయి జట్టుగా తీర్చిదిద్దాడు. ఇక టీమిండియాను విరాట్ కోహ్లీ మరోస్థాయికి తీసుకెళ్లాడు. కోహ్లీ గొప్ప ఆటగాడే కాదు అత్యుత్తమ నాయకుడు కూడా. గొప్ప పోరాట యోధుడు. మైదానంలోకి దిగితే అస్సలు భయపడడు. నాయకుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం అది. వ్యక్తిగతంగా పరుగులు సాధించడం కంటే.. మ్యాచ్‌ల్లో టీమిండియాని గెలిపించాలనే ఆకాంక్షతో ఆడుతుంటాడు. మైదానంలో సహచరులకి అతనే ఆదర్శం' అని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు డేవిడ్ లాయిడ్ చెప్పారు.

ఏకైక భారత సారథిగా అరుదైన ఘనత:
2017 నుంచి భారత్ జట్టుకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ.. ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. కానీ అతని కెప్టెన్సీలో టీమిండియా 55 టెస్టుల్లో 33 విజయహాలు అందుకుంది. భారత్ తరఫున టెస్టుల్లో కెప్టెన్సీపరంగా ఇదే బెస్ట్ రికార్డ్. ఇక కెప్టెన్‌గానూ ఆస్ట్రేలియా గడ్డపై 2018-19లో టెస్టు సిరీస్ గెలిచిన ఏకైక భారత సారథిగా అరుదైన ఘనతని సొంతం చేసుకున్నాడు. వన్డే, టెస్టుల్లో కలిపి ఇప్పటికే 70 సెంచరీలు నమోదు చేసిన కోహ్లీ.. సచిన్ నెలకొల్పిన 100 శతకాల రికార్డ్‌ని బ్రేక్ చేయగలడని మాజీలు అభిప్రాయపడుతున్నారు.

113 టెస్టులు.. 311 వన్డేలు:
అంతర్జాతీయ కెరీర్‌లో సౌరవ్ గంగూలీ ఇప్పటివరకు 113 టెస్టుల్లో, 311 వన్డే మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 7212 రన్స్ చేయగా.. ఇందులో 16 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 11363 పరుగులు చేసాడు. దాదా వన్డేల్లో 22 శతకాలు, 72 అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు విరాట్ కోహ్లీ టీమిండియా తరఫున 86 టెస్టులు, 248 వన్డేలు, 82 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 20 వేలకుపైగా రన్స్ బాదాడు.


Click it and Unblock the Notifications

ఐపీఎల్‌లో ఆడటం ఆనందమే.. కానీ: కేన్ విలియమ్‌సన్










