PAK vs SL: ఓడినా చుచ్చు పోయించాడు!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీని శ్రీలంక ఓటమితో ముగించింది. పాకిస్థాన్‌తో పల్లెకెలె వేదికగా శనివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో శ్రీలంక పోరాడి ఓడింది. ఓ దశలో ఘోర పరాజయం దిశగా సాగిన శ్రీలంక.. డసన్ షనక(31 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో తృటిలో విజయాన్ని చేజార్చుకుంది.
చివరకు 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఓడినా.. పాకిస్థాన్‌ను తమ వెంట ఇంటికి తీసుకెళ్లింది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరాయి.
శతక్కొట్టిన ఫర్హాన్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు షాహిబ్జాదా ఫర్హాన్(60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100), ఫకార్ జమాన్(42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84) విధ్వసంకర బ్యాటింగ్‌తో రాణించారు. ఈ ఇద్దరే తొలి వికెట్‌కు 176 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు.

ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు తీవ్రంగా నిరాశపర్చారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక(3/33) మూడు వికెట్లు తీయగా.. డసన్ షనక(2/42) రెండు వికెట్లు పడగొట్టాడు. దుష్మంత చమీర(1/48) ఒక వికెట్ తీసాడు.
అనంతరం శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. డసన్ షనకతో పాటు పవన్ రత్నాయకే(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. పాకిస్థాన్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్(3/23) మూడు వికెట్లు తీయగా.. షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, మహమ్మద్ నవాజ్ తలో వికెట్ తీసారు.
అబ్రార్ తీన్మార్..
213 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంకకు ఆశించిన ఆరంభం దక్కలేదు. పాకిస్థాన్ బౌలర్లు కట్టడి బౌలింగ్ చేయడంతో ఓ దశలో శ్రీలంక 147 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. పాకిస్థాన్ సెమీస్ చేరలంటే 65 పరుగులు భారీ తేడాతో గెలవాల్సి ఉండటంతో ఆ జట్టు గట్టిగా ప్రయత్నించింది. నసీమ్ షా, అబ్రార్ అహ్మద్(3/23), మహమ్మద్ నవాజ్ నిప్పులు చెరగడంతో శ్రీలంక 101 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
షనక సిక్సర్ల మోత..
మరో 46 పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు తీసేలా కనిపించింది. కానీ శ్రీలంక బ్యాటర్లలో పవన్ రత్నాయకే(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58), డసన్ షనక అద్భుతమైన బ్యాటింగ్‌తో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలను దెబ్బతీసారు. డ్యూ కూడా రావడంతో ఆకాశమే హద్దుగా చెలరేగారు. శ్రీలంక విజయానికి 12 బంతుల్లో 46 పరుగులు అవసరం కాగా.. షనక 19వ ఓవర్‌లో రెండు భారీ సిక్స్‌లతో 18 పరుగులు పిండుకున్నాడు.
ఆఖరి ఓవర్‌లో 28 పరుగులు అవసరం కాగా.. షాహీన్ అఫ్రిది బౌలింగ్2లో షనక వరుసగా 4, 6, 6, 6 బాది వణింకించాడు. ఐదో బంతి డాట్ కాగా.. ఆఖరి బంతికి సిక్సర్ అవసరమైంది. షాహీన్ వేసిన వైడ్ యార్కర్‌ను శనక వదిలేశాడు. అది వైడ్ అని అతను భావించినప్పటికీ, అంపైర్ 'ఫెయిర్ డెలివరీ'గా ప్రకటించడంతో పాకిస్థాన్ విజయం లాంఛనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications