20 బంతుల్లో 74 పరుగులు.. చరిత్ర సృష్టించిన శ్రీలంక బ్యాటర్!(వీడియో)
శ్రీలంక బ్యాటర్ డసన్ షనక చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఈ టోర్నీలో సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పాట్రియోట్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న డసన్ షనక.. సెయింట్ లూసియా కింగ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో చెలరేగాడు. 43 బంతుల్లో 8 ఫోర్లు, 12 సిక్స్‌లతో 121 పరుగులతో అజేయంగా నిలిచాడు.
10వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన షనక.. 16.1 ఓవర్ల సమయానికి 23 బంతుల్లో 47 పరుగులే చేశాడు. కానీ తర్వాతి 20 బంతుల్లో 370 స్ట్రైక్‌రేట్‌తో 74 పరుగులు చేశాడు. ఐదు ఫోర్లు, 4 సిక్స్‌లతో 24 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన డసన్ షనక.. మరో 15 బంతుల వ్యవధిలోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ 15 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు బాదాడు. 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద షనక ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతను ఇచ్చిన క్యాచ్‌ను లాంగాన్ మాథ్యూ ఫోర్డ్ వదిలేసాడు. ఈ అవకాశంతో అతను చెలరేగాడు.

సీపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలు..
డసన్ షనక-39 బంతుల్లో (సెయింట్ కిట్స్ వర్సెస్ సెయింట్ లూసియా కింగ్స్ 2026)
ఆండ్రీ రస్సెల్-40 బంతుల్లో (జమైకా తల్లాస్ వర్సెస్ సెయింట్ లూసియా 2018)
టీమ్ సీఫెర్ట్- 40 బంతుల్లో( సెయింట్ లూసియా కింగ్స్ వర్సెస్ అనింగ్వా బర్బుడా ఫాల్కన్స్, 2025)
షిమ్రాన్ హెట్‌మైర్- 40 బంతుల్లో(గయానా అమెజాన్ వారియర్స్ వర్సెస్ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 2025)
సెయింట్స్ కిట్స్ ఘన విజయం..
డసన్ షనక విధ్వంసంతో సెయింట్ కిట్స్ పాట్రియోట్స్ 137 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పాట్రియోట్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగులు చేసింది. డసన్ షనక(43 బంతుల్లో 8 ఫోర్లు, 12 సిక్స్‌లతో 121 నాటౌట్) అజేయ శతకంతో రాణించగా.. ఆండ్రీ ఫ్లెచర్(38 బంతుల్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
సెయింట్ లూసియా కింగ్స్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్ 2 వికెట్లు తీయగా.. మహీష తీక్షణ, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీసారు. అనంతరం సెయింట్ లూసియా కింగ్స్ 98 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. టీమ్ సీఫెర్ట్( 36 బంతుల్లో 8 ఫోర్లతో 50) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. జెరెమియా లూయిస్(5/10) ఐదు వికెట్లతో సెయింట్ లూసియా పతనాన్ని శాసించగా.. వానిండు హసరంగ రెండు వికెట్లు పడగొట్టాడు. నసీమ్ షా ఒక వికెట్ తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

