Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

4 బంతుల్లో 4 వికెట్లు..! (వీడియో)

క్రికెట్‌లో హ్యాట్రిక్ తీయడమే సంచలనం. వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లే గొప్ప ఘనత. అలాంటిది నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీస్తే.. అది కూడా గేమ్ ఛేజింగ్ ఓవర్ అయిన ఆఖరిదైతే.. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. అలాంటి అరుదైన ఫీట్‌ను శ్రీలంక ఆల్‌రౌండర్ డసన్ షనకా సాధించాడు.

అగ్రరాజ్యం అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఈ డబుల్ హ్యాట్రిక్ ఫీట్ సాధించాడు. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఈ ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. ఈ సంచలన ప్రదర్శనతో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

IND vs ENG: రవి బిష్ణోయ్ ఔట్?.. ఇంగ్లాండ్‌తో మూడో టీ20లో ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs ENG: రవి బిష్ణోయ్ ఔట్?.. ఇంగ్లాండ్‌తో మూడో టీ20లో ఆడే భారత తుది జట్టు ఇదే!

ఈ టోర్నీలో సియాటిల్ ఆర్కాస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డసన్ షనక.. టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సియాటిల్ ఆర్కాస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 121 పరుగులు చేసింది. కెమరూన్ గానన్ 21 బంతుల్లో 20 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Dasun Shanaka Scripts MLC History Claims Stunning Double Hat-Trick to Power Seattle Orcas Past TSK

అనంతరం టెక్సాస్ సూపర్ నిర్ణీత 20 ఓవర్లలో 112 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. డసన్ షనక అద్భుతం చేశాడు. చేతిలో 5 వికెట్లు ఉండటంతో టెక్సాస్ సూపర్ కింగ్స్ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ డసన్ షనక చివరి నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి సియాటిల్ ఆర్కాస్‌కు అదిరిపోయే విజయాన్ని అందించాడు.

ఈ ఓవర్‌లో తొలి రెండు బంతుల్లో ఐదు పరుగులిచ్చిన షనక.. చివరి నాలుగు బంతుల్లో అద్భుతంగా బౌలింగ్ చేసి వరుసగా వికెట్లను పడగొట్టాడు. అతని ధాటికి డొనొవన్ ఫెరియెరా, కాల్విన్ సావేజ్, ఆడమ్ మిల్నే, డిసిల్వలు వరుసగా పెవిలియన్ చేరారు.

వైభవ్ సూర్యవంశీ.. వన్డే ప్రపంచకప్ కూడా ఆడాలి: మాజీ క్రికెటర్

వైభవ్ సూర్యవంశీ.. వన్డే ప్రపంచకప్ కూడా ఆడాలి: మాజీ క్రికెటర్

ఈ సీజన్‌లో షనక దుమ్మురేపుతున్నాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో 196.05 స్ట్రైక్‌రేట్‌తో 149 పరుగులు చేశాడు. షనక ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సియాటిల్ ఆర్కాస్.. పాయింట్స్ టేబుల్‌లో ఎంఐ న్యూయార్క్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Monday, July 6, 2026, 12:57 [IST]
Other articles published on Jul 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+